అందుకే చంద్రబాబుకు కడుపు మంట : స్పీకర్ తమ్మినేని

Update: 2020-05-27 16:07 GMT
Tammineni Seetaram (File Photo)

టీటీడీ అధినేత చంద్రబాబు పై స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి ఫైర్ అయ్యారు. సీఎం వైఎస్ జగన్ ఏడాది పాలనను ప్రజలు అభినందిస్తుంటే ప్రతిపక్షం అనవసర విమర్శలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దొంగలు పడ్డా ఆరు నెలలకు కుక్కలు మోరిగినట్లుంది చంద్రబాబు వ్యవహారం ఉందని విమర్శించారు.

కరోనా అంతా అయిపోయాక ఇప్పుడు రాష్ట్రంలోకి దిగి రాజకీయ విమర్శలు చేస్తున్నారని, విపత్కర పరిస్థితుల్లో బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సహకరించి ఉంటే మెచ్చుకునే వాళ్ళమని తమ్మినేని అన్నారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇస్తే చంద్రబాబుకు కడుపు మంట ఎందుకని ధ్వజమెత్తారు.

తెలుగు భాషను ప్రభుత్వం ఎన్నడూ అగౌరవపరచలేదని, తెలుగు భాష అమ్మవంటిది. అమ్మకు ఎవరైనా పోటీ ఉంటారా..? అని ప్రశ్నించారు. విమర్శలు చేసేవారు భాషకు, మీడియంకు తేడా తెలులుకోవాలి, మీ పిల్లలు కార్పొరేట్ స్కూళ్లలో చదువుకోవాలి, కానీ పేదల పిల్లలు బాగుపడకూడదా అని స్పీకర్ తమ్మినేని నిలదీశారు.


Tags:    

Similar News