Anakapalli: హోంమంత్రి అనితకు మత్స్యకారుల నిరసన సెగ, ఉద్రిక్త పరిస్థితులు
అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి అనితకు నిరసన సెగ హోం మంత్రి అనిత కాన్వాయ్‌ను అడ్డుకున్న మత్య్సకారులు నక్కపల్లి మం. రాజయ్యపేట వద్ద మత్య్సకారుల ఆందోళన బల్క్ డ్రగ్స్ ఫ్యాక్టరీ వద్దంటూ 16 రోజులుగా నిరసన మత్స్యకారుల సమస్యలు తెలుసుకునేందుకు రాజయ్యపేటలో...
Anakapalli: హోంమంత్రి అనితకు మత్స్యకారుల నిరసన సెగ, ఉద్రిక్త పరిస్థితులు
అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి అనితకు నిరసన సెగ తగిలింది. హోంమంత్రి కాన్వాయ్‌ను మత్స్యకారులు అడ్డుకుని కారు ముందు నిరసన తెలిపారు. నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్స్ ఫ్యాక్టరీ నిర్మించవద్దని 16 రోజులుగా మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. మత్స్యకారుల సమస్యలు తెలుసుకునేందుకు రాజయ్యపేటలో మంత్రి అనిత, స్థానిక ఆర్డీవో, అధికారులు పర్యటించారు. వారితో మాట్లాడిన అనంతరం 10 మంది కలిసి ఓ కమిటీగా ఏర్పడాలని వారిని సీఎం, డిప్యూటీ సీఎం వద్దకు తీసుకెళ్తానని అనిత చెప్పి అక్కడి నుంచి బయల్దేరారు. అయితే తమకు స్పష్టమైన హామి ఇవ్వాలంటూ అనిత కారును అడ్డుకుని బైఠాయించారు. నిరసనకారులను చెదరగెట్టేందుకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి.