Gudivada: అమ్మ ఒడి అందరికీ అందేలా చూస్తాం: మంత్రి కొడాలి నాని

సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో 20వ వార్డు కు చెందిన సొంటి వైష్ణవి కలిశారు.

Update: 2020-03-06 12:55 GMT
మంత్రి కొడాలి నాని

గుడివాడ: సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో 20వ వార్డు కు చెందిన సొంటి వైష్ణవి కలిశారు. ఈ సందర్భంగా ఆమె మంత్రితో పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న ని అమ్మ ఒడి దరఖాస్తు చేసుకున్న నంది. తనకు అమ్మ ఒడి అర్హత ఉన్నా మంజూరీ కాలేదన్నారు.

అమ్మ ఒడి మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరింది. వైష్ణవి దరఖాస్తును పరిశీలించి అమ్మ ఒడి మంజూరు అయ్యేలా చూస్తానని మంత్రి ఆమెకు తెలిపారు.పాదయాత్రలో హామీ మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకానికి శ్రీకారం చుట్టారు అన్నారు.మాజీ వైస్ చైర్మన్ అడపా వెంకటరమణ బాబ్జి వైసిపి సీనియర్ నాయకులు పాలడుగు రామ్ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags:    

Similar News