Ambedkar Statue: విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం.. ఈ నెల 19న ప్రారంభోత్సవం
Ambedkar Statue: పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి నాగార్జున ఆదేశం
Ambedkar Statue: విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం.. ఈ నెల 19న ప్రారంభోత్సవం
Ambedkar Statue: అంబేడ్కర్ స్మృతి వనాన్ని ఏపీ ప్రభుత్వం విజయవాడలో ఏర్పాటు చేస్తోంది. స్వరాజ్ మైదాన్‌లో ప్రభుత్వం నిర్మించిన అంబేద్కర్ స్మృతివనం, 125 అడుగుల విగ్రహాలను ఈనెల 19న ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను ఏపీ సచివాలయంలో సంబంధిత అధికారులతో మంత్రి మేరుగు నాగార్జన సమీక్షించారు. ఈ కార్యక్రమం కోసమే జనభాగీధారి పేరిట అన్ని ప్రాంతాల నుంచి జనసమీకరణ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు స్మృతివనంలో అంబేద్కర్ జీవిత విశేషాలను తెలిపే విగ్రహాలు, చిత్రాలు, ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశామని మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు.