Eluru: డీసీఎంఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఆళ్శ నాని

ఏలూరు పట్టణంలోని డీసీఎంఎస్ కార్యాలయంలో ఐరన్, సిమెంట్ నూతన వ్యాపారాన్ని డిప్యూటీ సీఎం మంత్రి ఆళ్ళ నాని గురువారం ప్రారంభించారు.

Update: 2020-02-27 12:49 GMT
డీసీఎంఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఆళ్శ నాని

ఏలూరు: ఏలూరు పట్టణంలోని డీసీఎంఎస్ కార్యాలయంలో ఐరన్, సిమెంట్ నూతన వ్యాపారాన్ని డిప్యూటీ సీఎం మంత్రి ఆళ్ళ నాని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆళ్ళ నాని మాట్లాడుతూ... డీసీఎంఎస్ సంస్థలో వినూత్న ఆలోచనలతో కొత్త ఒరవడిని సృష్టిస్తూ... పైలట్ ప్రాజెక్ట్ గా మొట్టమొదటిసారి ఏలూరులో కార్యాలయంలో ప్రారంభించడం అభినందనీయమన్నారు.

ఈ ఘనత సిమెంట్, ఐరన్ వ్యాపారాన్ని తీసుకొచ్చిన జిల్లా కోపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ యడ్ల తాతాజికి చెందుతుందని అన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. అనంతరం ఛైర్మన్ యడ్ల తాతాజి మాట్లాడుతూ.... సీఎం సూచనల మేరకు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులతో పాటు రైతులకు సిమెంట్, ఐరన్ మార్కెట్ ధరల కన్నా తక్కువ ధరలకు అందిస్తున్నామని అన్నారు.


Tags:    

Similar News