కొద్దిసేపట్లో ఏపీ నూతన గవర్నర్‌ ప్రమాణ స్వీకారం

Update: 2019-07-24 05:00 GMT

ఏపీ నూతన గవర్నర్‌ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు బిశ్వభూషన్ హరిచందన్ ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా 461 మంది ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రశ్నోత్తరాల అనంతరం మధ్యాహ్ననికి అసెంబ్లీ ఉభయ సభలు వాయిదా పడనున్నాయి. వాయిదా అనంతరం సీఎం జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజ్ భవన్‌కు వెళ్తారు. ప్రమాణ స్వీకారం అనంతరం తిరిగి అసెంబ్లీకి చేరుకుంటారు. గవర్నర్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో.. రాజ్ భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.


Tags:    

Similar News