Akividu: ఎమ్మెల్యే మంతెన రామరాజు నెల జీతం విరాళం

ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు తన నెల జీతంను కలెక్టర్ ముత్యాలరాజు కు ట్రాన్స్ఫర్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Update: 2020-03-26 12:05 GMT
MLA Manthena Ramaraju

ఆకివీడు: ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు తన నెల జీతంను కలెక్టర్ ముత్యాలరాజు కు ట్రాన్స్ఫర్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆకివీడులో ఛాంబర్ అఫ్ కామర్స్ ఆధ్వర్యంలో 'మాలాదిన్' క్రిమిసంహారక మందును ట్యాంకర్లు ద్వారా పారిశుధ్యకార్మికులు ఆకివీడు నగరమంతా పిచికారీ చేశారు. అ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గోని శారద కాన్వెంట్, ఆదర్శ నగర్, గంగానమ్మ కోడు ప్రాంతాలలో స్వయంగా స్ప్రే తగిలించుకుని ఎమ్మెల్యే పిచికారీ చేసారు.

ఈ సందర్భంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని అన్నారు. ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులు గొట్టుముక్కల సత్యనారాయణరాజు మాలదిన్ ను సరఫరా చేసి పిచికారీ చేయించడం పై కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొట్టుముక్కల సత్యనారాయణరాజు, మండల అధ్యక్షులు మోటుపల్లి వర ప్రసాద్, పట్టణ అధ్యక్షులు బొల్లా వెంకట్రావు, కార్యదర్శి గొంట్లా గణపతి, చేబ్రోలు అజయ్, చేబ్రోలు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News