ఏలూరు జిల్లాలో దారుణం.. వివాహితపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ దాడి
Eluru: ఏలూరు ప్రభుత్వాస్పత్రికి బాధితురాలు తరలింపు
ఏలూరు జిల్లాలో దారుణం.. వివాహితపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ దాడి
Eluru: ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. వివాహితపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేశారు. స్థానికులు ఏలూరు ప్రభుత్వాస్పత్రికి బాధితురాలిని తరలించారు. విషయం తెలుసుకున్న ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ ఆస్పత్రికి చేరుకొని.. బాధితురాలతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలు విద్యానగర్‌లోని డెంటల్ క్లీనిక్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తుంది. అయితే కుటుంబ కలహాల కారణంగా భార్యాభర్తలు రెండేళ్లుగా దూరంగా ఉంటున్నట్లు సమాచారం.