Neelima: ఎమ్మెల్యేగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. రైతులు, నిరుద్యోగుల సమస్యలపై దృష్టి పెడతా
Neelima: కుప్పం ఎమ్మెల్యే భరత్ ఏం చేశారో చెప్పాలి
Neelima: ఎమ్మెల్యేగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. రైతులు, నిరుద్యోగుల సమస్యలపై దృష్టి పెడతా
Neelima: చిత్తూరు జిల్లా రాజకీయ రంగంలోకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎంట్రీ ఇస్తున్నారు. రానున్న ఎన్నికల్లో చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ స్థానానికి వైసీపీ రెబల్ అభ్యర్థిగా నీలిమ పోటీకి సిద్ధమవుతున్నారు. కుప్పం నియోజకవర్గంలోని మొరసనపల్లి గ్రామ అధికార పార్టీ సర్పంచ్ జగదీష్ సతీమణి నీలిమ రాజకీయ రంగంలోకి అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. దీంట్లో భాగంగా గ్రామాల్లో ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టారు. గ్రామాల్లో ప్రజలకు కలుస్తూ ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతులు, నిరుద్యోగుల సమస్యలపై దృష్టి పెడతానంటున్నారు నీలిమ.. తాను ఎమ్మెల్యేగా గెలుపొందితే కుప్పంలో నిరుద్యోగులు, రైతుల సమస్యలను పరిష్కరిస్తానంటున్నారామె... కుప్పం అసెంబ్లీ స్థానానికి ఒక్క మహిళకు కూడా రాజకీయంలో స్థానం కల్పింలేదని ఆవేదన వ్యక్తం చేశారామె...
స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజలకు సేవ చేయడానికే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని నీలిమ స్పస్టం చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు కుప్పం ప్రజలను ఇంకా ఎన్నాళ్లు మోసం చేస్తాయని నీలిమ ప్రశ్నించారు. 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న జగన్, 35 ఏళ్లు ఎమ్మెల్యేగా చంద్రబాబు కుప్పం ప్రజలకు ఏం చేశారో చెప్పాలని నీలిమ ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లుగా ఎమ్మెల్సీ భరత్ కుప్పం ప్రజలకు ఏం చేశారో చెప్పాలని నీలిమ సవాల్ విసిరారు. కుప్పం ప్రజలు, మహిళలు ఆలోచించి, తనకు ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు నీలిమ.. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని, తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని నీలిమ కోరారు.