జూలై 8న హైదరాబాద్‌ కేంద్రంగా పది రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం

BJP: పార్టీ సంస్థాగత బలోపేతంపై సమావేశంలో చర్చ

Update: 2023-06-28 03:36 GMT

జూలై 8న హైదరాబాద్‌ కేంద్రంగా పది రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం 

BJP: జూలై 8న హైదరాబాద్‌ కేంద్రంగా పది రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం జరుగుతుందని పార్టీ నేతలు తెలిపారు. తెలంగాణతో పాటు ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, అండమాన్‌, గోవా, లక్షద్వీప్‌, డయ్యూ డామన్‌ల పార్టీ అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. పార్టీ సంస్థాగత బలోపేతంపై ఇందులో చర్చించనున్నారు. కాగా, మేరా బూత్‌ సబ్‌ సే మజ్బూత్‌ కార్యక్రమంలో భాగంగా మధ్యప్రదేశ్‌ నుంచి 500 మంది కార్యకర్తలు బుధవారం రాష్ట్రానికి చేరుకోనున్నారు. వీరంతా రాష్ట్రవ్యాప్తంగా తమకు కేటాయించిన పోలింగ్‌ బూత్‌ల పరిధిలో పార్టీ బలోపేతం కోసం వారం రోజుల పాటు పనిచేయనున్నారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అన్ని స్థానాల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కార్యచరణను సిద్దం చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో విజయం సాధించి దక్షిణాదిలో మరోసారి ఖాతా తెరవాలని బీజేపీ ఉవ్వుల్లూరుతోంది. అందులో భాగంగా గతేడాది హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా అన్ని రాష్ట్రా ముఖ్య నేతలు హాజరైయ్యారు. ఈ సారి రాష్ట్రాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహాలు, విపక్షాలు ఉమ్మడిగా పోటీ చేసే స్థానాల్లో ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై చర్చించి అధినాయకత్వానికి నివేదికను అందజేయనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News