Vangalapudi Anitha: మాజీ సీఎం జగన్‌పై దేశద్రోహం కేసు పెట్టాలి
Vangalapudi Anitha: ప్రకాశం బ్యారేజ్‌ను ధ్వంసం చేయాలని బోట్లు పంపి కుట్ర చేశారు
Vangalapudi Anitha
Vangalapudi Anitha: మాజీ సీఎం జగన్‌పై దేశద్రోహం కేసు పెట్టాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. జగన్ రెండుసార్లు బయటికి వచ్చి తమ ప్రభుత్వంపై బురదజల్లి వెళ్లిపోయారని అనిత ఆరోపించారు. ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేయాలని కుట్ర పన్నారని ఆరోపించారు. బోట్లు వాటంతట అవే కొట్టుకురాలేదని...కొట్టుకొచ్చేలా చేశారన్నారు. ఏపీలో విధ్వంసం సృష్టించడానికి బోట్లను, వదిలిపెట్టారని ఇరిగేషన్ అధికారులే చెబుతున్నారని హోంమంత్రి అనిత అన్నారు. ప్రకాశం బ్యారేజీ పిల్లర్లను ఢీ కొట్టి ప్రమాదం జరిగితే, కొన్ని వేల మంది ప్రాణాలు పోయేవని హోం మంత్రి వంగలపూడి అనిత ఆందోళన వ్యక్తం చేశారు.