5వ రోజు ఏపీ సీఎం జగన్ బస్సుయాత్ర.. ఇవాళ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో కొనసాగనున్న యాత్ర
Jagan Bus Yatra: సంజీవపురం నుంచి బయల్దేరనున్న జగన్
5వ రోజు ఏపీ సీఎం జగన్ బస్సుయాత్ర.. ఇవాళ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో కొనసాగనున్న యాత్ర
Jagan Bus Yatra: ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. మేమంతా సిద్ధం అంటూ వైసీసీ అధినేత, సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రతో దూకుడు పెంచారు. మరోసారి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ఎన్నికల క్షేత్రంలో దూసుకుపోతున్నారు. ఇవాళ సత్యసాయి, అనంతపురం జిల్లాలో ఐదో రోజు సీఎం జగన్ బస్సుయాత్ర కొనసాగనుంది.
బస్సుయాత్రలో భాగంగా బత్తలపల్లి, రామాపురం, కట్ట కిందపల్లి, రాళ్ళ అనంతపురం, ముదిగుబ్బ, ఎన్‌ఎస్పి కొట్టల, మలకవేముల మీదుగా సీఎం జగన్ పట్నం చేరుకోనున్నారు. ఆ తర్వాత పట్నం నడింపల్లి, కాలసముద్రం, ఎర్రదొడ్డి మీదుగా కుటగుల చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం తర్వాత బయలుదేరి కదిరి పట్టణం చేరుకుని, అక్కడ మైనార్టీలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. ఆ తర్వాత మోటుకపల్లె మీదుగా జోగన్నపేట, ఎస్ ములకలపల్లె, మీదుగా చీకటిమనిపల్లెలో చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు.