సీఎం పదవికి జగన్‌ రాజీనామా చేయాలి : చంద్రబాబు

సీఎం పదవికి జగన్‌ రాజీనామా చేయాలి : చంద్రబాబు సీఎం పదవికి జగన్‌ రాజీనామా చేయాలి : చంద్రబాబు

Update: 2019-09-22 08:04 GMT

ఏపీ సీఎం జగన్‌ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. గ్రామ సచివాలయ పరీక్ష లీకేజీ అయిందని ఆరోపించిన ఆయన జగన్ నైతిక బాధ్యత వహిస్తూ.. సీఎం పదవి నుంచి తప్పుకోవాలన్నారు. ఈ పరీక్షలను తక్షణమే రద్దు చేసి మళ్లీ పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. సీఎం రాజీనామా చేస్తారో లేక పంచాయితీరాజ్, విద్యాశాఖ మంత్రులే రాజీనామా చేస్తారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. బాధ్యులైన కఠిన చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. 4 నెలల వైసీపీ పాలనలో రాష్ట్రం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుందని.. వీటన్నింటికి సీఎం అనుభవ రాహిత్యం, చేతకానితనమే కారణమని విమర్శించారు.

Tags:    

Similar News