కరోనా వైరస్ సోకి మరో పోలీస్ అధికారి మృతి..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.

Sumitra
Published on: 22 Jun 2020 7:33 PM IST
కరోనా వైరస్ సోకి మరో పోలీస్ అధికారి మృతి..
X

తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కరోనాను కట్టడి చేయడానికి ఎంతగానో శ్రమించి కీలకంగా వ్యవహరించిన పోలీసులు, కరోనా వైరస్‌పై పోరు చేస్తున్న వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకుతోంది. ఇప్పటి వరకు ఎంతో మంది తెలంగాణ పోలీసులు కరోనా బారిన పడుతున్నారు. మొన్నటికి మొన్న ఓ కానిస్టేబుల్ కరోనాతో మృతిచెందిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఇలాంటి సంఘటనే మరొకటి చోటుచేసుకుంది. తాజాగా మరో పోలీసులు అధికారి మృతిచెందాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో ఏఎస్ఐగా విధులు ఓ పోలీస్ కరోనా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన గత వారం రోజుల క్రితం కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు ఆయన్ని హైదరాబాద్ నగరంలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. కాగా ఆయన చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు.


Sumitra

Sumitra

Next Story