తెలంగాణలో కొత్తగా 730 పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ఆదివారం రికార్డు స్థాయిలో 730 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇందులో 659 కేసులు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ వెల్లడించింది.

Raj
By Raj
Published on: 21 Jun 2020 9:58 PM IST
తెలంగాణలో కొత్తగా 730 పాజిటివ్ కేసులు
X

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ఆదివారం రికార్డు స్థాయిలో 730 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇందులో 659 కేసులు ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7,802 కి చేరుకున్నాయి. ఇందులో ఇప్పటి వరకు 3731 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 3861 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా భారిన పడి 210 మంది మరణించారు. ఇదిలావుంటే గత 24 గంటల్లో మొత్తం 3297 మందికి పరీక్షలు చేశారు. దీంతో రాష్ట్రంలో టెస్టుల సంఖ్య మొత్తం 57 వేల 054 కు చేరింది.



Raj

Raj

Next Story