దేశంలోనే తొలి స్థానంలో ఏపీ పోలీసులు.. కంగ్రాట్స్ చెప్పిన సీఎం

దేశంలోనే ఆంధ్రప్రదేశ్ కు చెందిన పాస్ పోర్ట్ వెరిఫికేషన్ & క్లియరెన్స్‌ తొలి స్థానంలో నిలిచి అవార్డు దక్కించుకున్నారు. వరుసగా

Samba Siva Rao
Updated on: 24 Jun 2020 2:15 PM IST
దేశంలోనే తొలి స్థానంలో ఏపీ పోలీసులు.. కంగ్రాట్స్ చెప్పిన సీఎం
X

దేశంలోనే ఆంధ్రప్రదేశ్ కు చెందిన పాస్ పోర్ట్ వెరిఫికేషన్ & క్లియరెన్స్‌ తొలి స్థానంలో నిలిచి అవార్డు దక్కించుకున్నారు. వరుసగా రెండో సారి మొదటి స్థానంను ఏపీ పోలీస్‌శాఖ సొంతం చేసుకుంది. ప్రజలకు మెరుగైన రీతిలో పాస్ పోర్ట్ సేవలను అందిస్తున్న అందుకుగాను ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మెరుగైన రీతిలో పాస్ పోర్ట్ సేవలను అందిస్తున్న అందుకుగాను మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ (కేంద్ర విదేశాంగశాఖ) అవార్డును ప్రకటించింది.

పాస్ పోర్ట్ వెరిఫికేషన్ & క్లియరెన్స్ లో ఉత్తమ సేవలు అందిస్తున్న సిబ్బందిని ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి అభినందించారు.ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు పోలీస్ శాఖ మరింతగా సన్నద్ధంతో ఉంటుందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఈ అవార్డుల్లో ఏపీకి మొదటి స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో తెలంగాణ పోలీస్ శాఖ నిలిచింది. మూడు నాలుగు స్థానాల్లో హర్యానా, కేరళలు నిలిచాయి. తొలి రెండు స్థానాల్లో తెలుగు రాష్ట్రాలు నిలవడం విశేషం.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story