వైఎస్‌ రాజారెడ్డికి కుటుంబసభ్యుల నివాళి

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాత వైఎస్ రాజారెడ్డి 22వ వర్ధంతి నేడు..

Raj
By Raj
Published on: 23 May 2020 1:08 PM IST
వైఎస్‌ రాజారెడ్డికి కుటుంబసభ్యుల నివాళి
X
Family Prays Tribute to YS Rajareddy on His Death anniversary

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాత వైఎస్ రాజారెడ్డి 22వ వర్ధంతి నేడు.. ఈ సందర్బంగా వైఎస్ కుటుంబసభ్యులు, వైసీపీ కార్యకర్తలు పులివెందులలోని రాజారెడ్డి ఘాట్‌ వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తాడేపల్లి నుంచి నేరుగా పులివెందుల చేరుకొని రాజారెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించారు.

అనంతరం రాజారెడ్డి మెమోరియల్‌ పార్కులోని ఆయన విగ్రహం వద్ద అంజలి ఘటించి.. జీసెస్‌ చారిటీస్‌లోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా రాజారెడ్డికి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ కుటుంబీకులు వైఎస్ సౌభాగ్యమ్మ, వైఎస్ మనోహర్ రెడ్డి, దివంగత మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి,అల్లుడు రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Raj

Raj

Next Story