బాబు టూర్‌కు కేంద్రం ఓకే

CM Chandrababu
x
CM Chandrababu
Highlights

అగ్గిరాజేసిన చంద్రబాబు దావోస్ టూర్‌ అంతలోనే చల్లారింది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పర్యటించాల్సిన చంద్రబాబు టీమ్‌కు ఆంక్షలు విధించిన కేంద్ర విదేశాంగశాఖ గంటల వ్యవధిలోనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. చంద్రబాబుతో పాటు 17 మంది దావోస్‌లో పర్యటించేందుకు అనుమతిచ్చింది.

అగ్గిరాజేసిన చంద్రబాబు దావోస్ టూర్‌ అంతలోనే చల్లారింది. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పర్యటించాల్సిన చంద్రబాబు టీమ్‌కు ఆంక్షలు విధించిన కేంద్ర విదేశాంగశాఖ గంటల వ్యవధిలోనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. చంద్రబాబుతో పాటు 17 మంది దావోస్‌లో పర్యటించేందుకు అనుమతిచ్చింది. దీంతో కేంద్ర రాష్ట్రాల మధ్య మరో వార్‌ మొదలైందన్న వార్తలకు ఆదిలోనే బ్రేక్ పడినట్లైంది.

ఏటా స్విట్జర్‌ల్యాండ్‌లోని దావోస్‌లో జరగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు మనదేశం తరపున చంద్రబాబుతో పాటు 14 లేదా 15 మంది బృందం హాజరుకానుంది. అయితే ఈ సారి కూడా చంద్రబాబు తన బృందంతో కలిసి వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం విదేశాంగ శాఖ అనుమతి కోరింది. అయితే దీనిపై విదేశాంగ శాఖ తొలుత ఆంక్షలు విధించింది. దావోస్‌ పర్యటనలో చంద్రబాబుతో సహా ఐదుగురికి మాత్రమే అనుమతిచ్చింది.

ఇప్పటికే ఉప్పూ నిప్పులా ఉన్న కేంద్ర రాష్ట్ర మధ్య సంబంధాలపై ఈ వ్యవహారం మరింత ఆజ్యం పోసినట్లైంది. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు చంద్రబాబు దావోస్ వెళ్లాలనుకుంటే కేంద్రం అడ్డుకుంటుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కేంద్రం, రాష్ట్రం మధ్య మరో వివాదం మొదలైందనే వార్తలు వచ్చాయి. కేంద్రం నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఆ తర్వాత కేంద్ర విదేశాంగశాఖ సూచన మేరకు ఏపీ సర్కార్ మరోసారి దరఖాస్తు చేసుకుంది. దీంతో ఏపీ ప్రభుత్వం కోరిన విధంగా దావోస్‌ పర్యటనకు కేంద్ర విదేశంగాశాఖ నుంచి అనుమతి లభించింది. 5 గంటల్లోనే క్లియరెన్స్‌ వచ్చింది.

ఈ 22 నుంచి నాలుగు రోజుల పర్యటనకు చంద్రబాబుకు కేంద్రం నుంచి పర్మీషన్‌ వచ్చింది. ఈ విషయం రాజకీయంగా కలకలం రేపినా చివరకు సద్దుమణిగింది. దావోస్ పర్యటనకు కేంద్రం నుంచి అడ్డంకులు తొలగడంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories