Breaking News: విశాఖలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసి పడుతున్న మంటలు..!
Breaking News: విశాఖపట్నంలోని సెవెన్ హిల్స్ హాస్పిటల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మనుషులు లేకపోవడంతో తప్పిన ప్రమాదం.
Visakhapatnam Fire Accident
Breaking News: విశాఖలో అగ్నిప్రమాదం సంబవించింది. సెవెన్ హిల్స్ హాస్పిటల్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. విద్యుత్ షార్ట్ సర్క్యుట్ కారణంగా ప్రమాదం జరిగిందని సిబ్బంది చెబుతున్నారు. ప్రమాద సమయంలో మనుషులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై విశాఖ సీపీ శంఖబత్ర బాగ్చి మాట్లాడుతూ ఆసుపత్రుల్లో తరుచు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం బాధకరమని అన్నారు. ఇకపై అన్ని ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీ పాటిస్తున్నారా లేదా అన్నది ఫైర్ అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ప్రాణాలు రక్షించుకోవాడానికి ఆసుపత్రులకు వస్తారని ,వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఆస్పత్రి యాజమాన్యంపై ఉందని సీపీ అన్నారు. నిర్లక్ష్యం వ్యవహరిస్తే భారీ మూల్యం చేల్లించుకోవాల్సి ఉంటుందని సీపీ బాగ్చి హెచ్చరించారు.