వైజాగ్ ఎకనమిక్ రీజియన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష
వైజాగ్ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు.
విశాఖపట్నం: వైజాగ్ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. వీఈఆర్ మాస్టర్ ప్లాన్ అజెండాపై సమావేశంలో చర్చించారు. విశాఖ ఎకనమిక్ రీజియన్ సమగ్ర అభివృద్ధి, రోడ్లు, రైలు మార్గాలు, పోర్టులు, లాజిస్టిక్స్ ఇతర రంగాలకు సంబంధించి మొత్తం 49 ప్రాజెక్టులపైన చర్చ జరిగింది. వీఈఆర్‌ను 2032 కల్లా 125 నుంచి 135 బిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సమావేశం నిర్వహించారు. వాణిజ్యం, పరిశ్రమలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పర్యాటకం, మౌలిక సదుపాయాలు, రహదారులు, ఐటీ, వ్యవసాయం, అటవీ, వైద్యారోగ్యం, విద్య, నైపుణ్య శిక్షణ, విద్యుత్... ఇలా శాఖల వారీగా, విడివిడిగా యాక్షన్ ప్లాన్ రూపకల్పన జరిగింది. వీఈఆర్‌లో ప్రస్తుతం చేపట్టిన, నూతనంగా చేపట్టాల్సిన రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులపైనా ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించారు.
వీఈఆర్ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, కింజరాపు అచ్చెన్నాయుడు, పొంగూరు నారాయణ, టీజీ భరత్, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, కొల్లు రవీంద్ర, సీఎస్ విజయానంద్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఏఎస్ఆర్, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.