Mahabubabad: లేక్ వ్యూ నేచర్ పార్క్‌లో మొక్కలు నాటిన కలెక్టర్ స్నేహా శభరీష్!
Mahabubabad: అర్బన్ పార్క్‌లో కలెక్టర్ స్నేహా శభరీష్ వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. జిల్లా వ్యాప్తంగా 43 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
Mahabubabad: లేక్ వ్యూ నేచర్ పార్క్‌లో మొక్కలు నాటిన కలెక్టర్ స్నేహా శభరీష్!
Mahabubabad: వన మహోత్సవం కార్యక్రమంలో ప్రజలందరూ మొక్కలు నాటి ఎల్ నినో లాంటి ఉపద్రవాలు రాకుండా చూడాలని అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారు లోని లేక్ వ్యూ నేచర్ పార్క్ ( అర్బన్ పార్క్ ) లో జిల్లా కలెక్టర్ స్నేహా శభరీష్ ,అటవీ శాఖ అధికారి లావణ్య జిల్లా అధికారులతో కలిసి మొక్కలు నాటి వన మహోత్సవం కార్యక్రమం లో పాల్గొన్నారు.
అనంతరం కలెక్టర్ , అధికారులు అర్బన్ పార్క్ లో కలియ తిరుగుతూ వ్యూని పరిశీలించారు.ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 43 లక్షల మొక్కలను వివిధ శాఖల ద్వారా నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని , అటవీ శాఖ పరిధి లో నాలుగున్నర లక్షల మొక్కలనునాటామని , స్వచంధ సంస్థల సహకారం తో సీడ్ బాల్స్ ను అడవుల్లో వదిలామని , సహకరించిన ఎన్జీవోలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ నాటిన మొక్కలను సంరక్షించాలని కోరారు.కార్యక్రమం లో మున్సిపల్ కమీషనర్ వినోద్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి , అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.