Visakhapatnam: ఏయూలో మెగా సందడి పవన్ కళ్యాణ్ రాకతో పీక్స్‌కు చేరనున్న వేడుకలు!

Visakhapatnam: విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నేటి నుంచి మూడు రోజుల పాటు మెగా కల్చరల్ ఫెస్ట్ 2026 ప్రారంభం.

Update: 2026-04-06 01:51 GMT

Visakhapatnam: ఏయూలో మెగా సందడి పవన్ కళ్యాణ్ రాకతో పీక్స్‌కు చేరనున్న వేడుకలు!

విశాఖపట్నం: ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం శ‌తాబ్ధి మ‌హోత్స‌వంలో భాగంగా సోమవారం నుంచి 8వ‌తేదీ వ‌ర‌కు మూడు రోజుల పాటు మెగా క‌ల్చ‌ర‌ల్ ఫెస్ట్ 2026 నిర్వ‌హిస్తున్నారు. కార్యక్రమం ఏర్పాటును మెగా కల్చరల్ ఫెస్ట్ చైర్మన్ ఆచార్య ఎన్.విజయమోహన్ తెలిపారు..

6వ తేదీన మెద‌టి రోజు కార్య‌క్ర‌మాల‌ను రాష్ట్ర హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ముఖ్య అతిధిగా హాజ‌రై ప్రారంభిస్తారు. రెండ‌వ రోజు కార్య‌క్ర‌మాల‌కు విశాఖ పార్ల‌మెంట్ స‌భ్యులు ఎం.శ్రీ‌భ‌ర‌త్ ముఖ్య అతిధిగా పాల్గొంటారు. మూడవ రోజు కార్య‌క్ర‌మానికి రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి కె.ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజ‌రవుతారు.

శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించే విధంగా మూడు రోజులపాటు ఏయూ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల మైదానంలో భారీ స్థాయిలో కల్చరల్ ఫెస్ట్ ను నిర్వహిస్తున్నారు. నగరవాసులంతా ఈ కార్యక్రమాలను ప్రత్యక్షంగా తిలకించి తమ విద్యార్థులను అభినందించాలని కోరారు.

సైక్లింగ్ తో కార్యక్రమాలు ప్రారంభం..

సోమవారం ఉద‌యం 7 గంట‌ల‌కు ఏయూ క‌న్వెన్ష‌న్ కేంద్రం నుంచి రుషికొండ వ‌ర‌కు సైక్లింగ్‌తో కార్య‌క్ర‌మాలు ప్రారంభ‌మ‌వుతాయ‌న్నారు. మెక్క‌లు నాటే కార్య‌క్ర‌మం, సాయంత్రం ఇంజ‌నీరింగ్ క‌ళాశాల మైదానంలో ప్ర‌ధాన వేదిక‌పై లైవ్ బ్యాండ్‌, సంస్కృతిక కార్య‌క్ర‌మాలు ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హిస్తారు. త‌ప్పెట‌గుళ్లు ప్ర‌ద‌ర్శ‌న‌, యోగా విద్యార్థుల ప్ర‌ద‌ర్శ‌న‌, ఏయూ యునైటెడ్ విద్యార్థుల బృందం ప్ర‌ద‌ర్శ‌న‌లు, ఏయూ అంత‌ర్జాతీయ విద్యార్థుల నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌, మ్యూజిక‌ల్ నైట్ జ‌రుపుతారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా హోం మినిస్ట‌ర్ వంగ‌ల‌పూడి అనిత హాజ‌ర‌వుతారు.

రెండ‌వ రోజ‌యిన 7వ తేదీన ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో రంగోలి పోటీ, స‌లాడ్ డెక‌రేష‌న్‌, ఎథినిక్ డే ఫోటో బూత్ కాంటెస్ట్‌, సాయంత్రం ప్ర‌ధాన వేదిక‌పై విద్యార్థుల సాంసస్కృతిక కార్య‌క్ర‌మాలు, ప్ర‌ముఖ గాయ‌ని వాగ్ధేవి సంగీత విభావ‌రి, విదేశీ విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు త‌దిత‌ర కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా ఎంపి ఎం.శ్రీ‌భ‌ర‌త్ పాల్గొంటారు.

చివ‌రి రోజున 8వ తేదీన ఉద‌యం 7 గంట‌ల‌కు ఏయూ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ నుంచి వాక‌థాన్ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు. సాయ‌త్రం వేదిక‌పై లైవ్ బ్యాండ్‌ల ప్ర‌ద‌ర్శ‌న‌, ఏయూ విద్యార్థుల సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు, ధింసా నృత్యం, కోలాటం ప్ర‌ద‌ర్శ‌న‌, పులివేషం,ఏయూ యునైటెడ్ క్ల‌బ్‌, ఏయూ విద్యార్థులు, అనుబంధ క‌ళాశాల‌ల విద్యార్థుల సాంస్కృతిక కార్య‌క్ర‌మాల ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రుగుతాయి. విజేత‌ల‌కు బ‌హుమ‌తుల‌ను ముఖ్య అతిధి, రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి కె.ప‌వ‌న్ క‌ళ్యాణ్ అందిస్తారు.

కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆచార్య ఎన్.ఎం యుగంధర్, కన్వీనర్ ఆచార్య సిహెచ్ ఆశ ఇమ్మానియేల్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News