Visakhapatnam: ఆదర్శప్రాయుడు బాబు జగ్జీవన్ రామ్.. ఎమ్మెల్యే గణబాబు ఘన నివాళి
Visakhapatnam: విశాఖ పశ్చిమ నియోజకవర్గం 90, 91 వార్డుల్లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సంబరాలు. ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో ఘన నివాళి.
Visakhapatnam: ఆదర్శప్రాయుడు బాబు జగ్జీవన్ రామ్.. ఎమ్మెల్యే గణబాబు ఘన నివాళి
విశాఖపట్నం: స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ సేవలు ఎంతో ఆదర్శమని విశాఖ పశ్చిమ నియోజవర్గం ఎమ్మెల్యే గణబాబు అన్నారు. ఆదివారం జీవీఎంసీ 90,91 వార్డుల్లో స్వాతంత్ర్య సమరయోధులు, భారతదేశ తొలి ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే గణబాబు మీడియాతో మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బాబు జగ్జీవన్ రావు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మహా నేత అని కొనియాడారు. సామాజిక న్యాయం సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ఆయన చేసిన త్యాగాలు సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నేతలు పాల్గొన్నారు.