Jordar News: హైదరాబాద్ పబ్లిక్ కు చుక్కలు చూపిస్తున్న ఉప్పల్ స్కైవాక్
Jordar News: హైదరాబాద్ ఉప్పల్ స్కైవాక్ లిఫ్ట్‌లో సాంకేతిక లోపం కారణంగా ఒక యువకుడు రెండు గంటల పాటు నరకం చూశాడు.
Jordar News: హైదరాబాద్ పబ్లిక్ కు చుక్కలు చూపిస్తున్న ఉప్పల్ స్కైవాక్
Jordar News: పేరు గొప్ప ఊరు దిబ్బ అని సాత్రం శెప్పినట్టే ఉన్నయుల్ల ఐద్రవాదు పట్నంల సౌలత్లు. కోట్ల రూపాలు కర్సుజేశి కట్టిచ్చిన ఉప్పల్ స్కైవాక్ మూడేండ్లకే సుక్కల్ సూయించుతున్నది పబ్లిక్కు. ఇంతకేమైందంటుల్ల..ఇగో మైబాద్ శెందిన రాహుల్ అనేటి ఈ తమ్ముడు ఉప్పల్ల ఓ హాస్టళ్ల ఉండుకుంట ప్రవేటు కొలువు జేస్తున్నడట పట్నంల. మరిగ కొలువుకువొయ్యే వస్తున్నడు గావచ్చు.. బేస్తారం రాత్రి పదకొండు గంటలకు హాస్టల్కు పోదామని ఎక్కిండట ఉప్పల్లున్న ఈ స్కైవాక్ లిఫ్టు. అంతవరకు అంత మంచిగనే ఉన్నది. కని, ఇంకాశేపైతే కిందికి దిగుతడు అనంగ సడన్ బ్రేకు ఏశినట్టు నడ్మిట్ల ఆగి, లిఫ్టు తల్పులు ఎంతకు తెర్సుకోలేదట. గుండెలు గుభేల్లుమనొచ్చు పాపం తమ్మునికి. కొద్ది భయం గాలేదు గావచ్చు. ఇదే ఫ్లేసుల ఏ లీడరో, ఏ సెలబ్రెటీనో ఉంటె.. ఆగమేగాల మీద తెరుస్తురు గావచ్చుల్ల లిఫ్టు తల్పులు. కని, అధికార్లచ్చి, లిఫ్టు తెర్శి తమ్మున్ని బైటికి తీశెటాళ‌్లకు రొండు గంటలకు మీదనే పట్టిందంటె సూడుర్రి ఎంత ఉషారున్నరో లిఫ్టు బాధ్యతలు సూస్కునేటి కంపినొల్లు, ఐద్రవాదు పట్నాన్ని డెవలెప్ జేశేటి హెచ్ఎండీఏ అధికార్లు. ఇగ ముచ్చట తెల్శి హైడ్రా అధికార్లు, పోలీస్లు, ఫైర్ సిబ్బంది రంగంలకు దిగి, టెక్నిషీయన్ను ముంగటవెట్టి రొండు గంటలు పాతులాడ్తె గప్పుడు తెర్సుకున్నయి తల్పులు. అట్ల పదకొండింటికి లిఫ్టు ఎక్కిన తమ్ముడు, ఒకటింపావుకు బైటికి అచ్చిండట. అసల్కే ఈ తమ్మున్కి గుండెకు సంబంధించిన తక్లీఫున్నదట. నేను హార్టు పేషెంటును, నాకేమన్నయితే నా కుటుంబం పర్సితేంది.. నా పానాలకంటె ఎక్వనా లిఫ్టు అని మస్తు బాధ పడ వట్టిండు పాపం బైటికచ్చినంక.
పాపం అనిపిస్తున్నది గదానుల్ల తమ్ముని మాటలు ఇంటుంటె. ఇదే జాగల లీడరెవ్వలన్నుంటె గింత ఆల్శం జేస్తురా. ఆగమేఘాల మీద.. లిఫ్టు పల్గొట్టయినా బైటికి తీస్తురు. కని, ఈడ అట్ల శెయ్యలేదు. లిఫ్ట్ బాధ్యతలు సూస్తున్న, కన్‌స్ట్రక్షన్ సిబ్బంది, హెచ్‌ఎండీఏ అధికార్లు జప్పన స్పందించకపోవుట్లనే లేటయిందని అంటున్నరు. మెయింటెనెన్సుల గుడ మస్తు లోపాలున్నయట. మరి ఇప్పటికన్న మల్లోతాపు ఇట్ల జర్గకుంట చేత్తరో లేకుంటె నాలుగొద్దులయితె అందరు మర్శిపోతరు అని సప్పుడ్జేకనే ఉంటరో సూడాలె అధికార్లు గని, పబ్లిక్కూ మీరైతే పైలముల్ల.