Jordar News: లంచం తీసుకున్నారు.. అడ్డంగా బుక్కయ్యారు
Jordar News: మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటలో అవినీతి అధికారుల బండారం బయటపడింది.
Jordar News: లంచం తీసుకున్నారు.. అడ్డంగా బుక్కయ్యారు
Jordar News: అగో పట్ట పట్ట పేలుస్తున్నరు గదా పటాకులు. ఐనా ఇప్పుడేం పండుగ సుతం లేదు.. శెవ్వులు గిల్లుమనేతట్టు ఈ పటాకులు గోలేందంటరా.. ఇగో ఈడ గులాబీ రంగు బాటిళ్ల ఎన్క.. కల శెదిరింది.. కథ మారింది.. కన్నీరే ఇక మిగిలింది అనే రేంజిల న్యాలకు మొఖమేస్కోని దీనంగ కూసున్నరు సూశిర్రా. ఇండ్ల నడ్మిట్లున్నామే ఎంపీడీవో. పేరు రాధిక. ఆమెకు ఎడ్మ పక్కున్నాయినె ఎంపీవో.
పేరు యాకయ్య. సర్కారిచ్చేటి జీతాలు సాల్తలెవ్వో మన్నో ఇద్దరికిద్దరు లంచాలకు మర్గిర్రు. కని, ఎన్ని రోజులు సాగుతయి ఈల్ల ఆటలు. ఏదో వెంచర్ కోసమని లంచం డిమాండు చేత్తె పాపం పండింది ఇయ్యల్ల. 45 వేలు తీస్కుంట ఏసీబొల్లు ఏశిన వలకు రెడ్ హ్యాండెడ్గ శిక్కిర్రు ఇద్దరాకం.ఇప్పటిదాంక లంచాల కోసం లోకల్ జనాలను ఎంత పీడించక తిన్నరో.. పబ్లిక్కును ఎంత తిప్పల వెట్టిర్రో. అందుకే పీడ విర్గడైంది అన్నట్టు జనాలు సంబురాలు జేస్తున్నరిట్ల పటాకులు గాల్శి. ఇగిప్పుడు ఈడ కానొస్తున్న మూడో మనిషి ఎవ్వలు అని మీకో డౌటానుమానం రావొచ్చు. అచ్చే ఉంటది గదా. ఎంపీడీవో పుత్రరత్నమటుల్ల ఈ మోతెవరి. పేరు నాగార్జున.
ఈ లంచం కేసుల మోతెవరిదేనట మేన్ రోల్. నల్భయి ఐదువేలల్ల.. ఎంపీడీవోకు అంటె తల్లి 25 వేలు, ఎంపీవోకు 20వేలు ఇయ్యన్నని బేరం తెగ్గొట్టినట్టున్నడు నడ్మిట్లుండి. అట్లనే లంచం తీస్కుంటుంటె ఏసీబొల్లు పక్కా ప్లాన్తోటి పట్టుకోని, పైసల్ తీస్కోని ముగ్గుర్ని తీస్కున్నరు అదుపులకు. ఇంతకు ఇదెక్కడ జర్గిందో శెప్పలేదు గదానుల్ల. మైబాద్ జిల్లా నర్సింహులపేట మండలంల.