News Analysis: డీఎస్సీ అక్రమాలపై టీడీపీ క్లారిటీ.. ఆరోపణలను తిప్పికొట్టిన లింగారెడ్డి!
News Analysis: ఏపీ డీఎస్సీ (DSC 2025) ఎంపికల వివాదం, రిజర్వేషన్లు, స్పోర్ట్స్ కోటా ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత మల్లెల లింగారెడ్డి హెచ్‌ఎమ్‌టీవీ న్యూస్ అనాలిసిస్‌లో స్పందించారు.
News Analysis: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ నిర్ణయాలు మరియు రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన డీఎస్సీ ఎంపికల ప్రక్రియపై హెచ్‌ఎమ్‌టీవీ (hmtv) ప్రత్యేక 'న్యూస్ అనాలిసిస్' నిర్వహించింది. ఈ డిబేట్‌లో పాల్గొన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి డీఎస్సీ ఎంపికల్లో అక్రమాలు జరిగాయంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
గతంలో జిల్లా స్థాయిలో పొలిటికల్ జోక్యం ఎక్కువగా ఉండే డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (DSC) విధానాన్ని మార్చి, అత్యంత పారదర్శకంగా, మెరిట్, సామాజిక న్యాయం ప్రాతిపదికన డీఎస్సీని నిర్వహించేలా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమేనని లింగారెడ్డి గుర్తుచేశారు. లీకులకు తావులేకుండా ఆన్‌లైన్ విధానంలో పక్కాగా పరీక్షలు నిర్వహించామని తెలిపారు.