Burning Topic: షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు.. మళ్ళీ భగ్గుమన్న బంగ్లా!
Burning Topic: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ప్రకటన చేశారు. తనకు మరణశిక్ష విధించినా డిసెంబర్‌లో స్వదేశానికి వెళ్తానని స్పష్టం చేశారు.
Burning Topic: షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు.. మళ్ళీ భగ్గుమన్న బంగ్లా!
Burning Topic: తనకు మరణశిక్ష విధించినా స్వదేశానికి వెళ్లి తీరుతానని ప్రకటించారు బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా. ఏదేమైనా డిసెంబర్‌లో తాను వెళ్లతానని, దేశ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి దూరంగా ఉండలేనని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌లో చట్టబద్ధ పాలనను, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అంతర్జాతీయ సమాజం మద్దతివ్వాలని పిలుపునిచ్చారు.
భారత్‌లో ఉన్న షేక్‌హసీనా మీడియాతో మాట్లాడేందుకు అనుమతి ఇబ్బండంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఎంపీ షకీబ్ అల్ హసన్ ఇంటిపై పెట్రోల్ దాడి జరిగింది.