Tirupati: ఏఈఈ నియామక పరీక్షలకు సర్వం సిద్ధం: ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ!

Tirupati: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో 629 ఏఈఈ పోస్టుల భర్తీకి ఈ నెల 23 నుంచి పరీక్షలు. ఏర్పాట్లను వివరించిన ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి.

Update: 2026-08-22 08:06 GMT

Tirupati: ఏఈఈ నియామక పరీక్షలకు సర్వం సిద్ధం: ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ!

Tirupati: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి నిర్వహించనున్న నియామక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు.

ఆగస్టు 23 నుంచి 27 వరకు ఐదు రోజుల పాటు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు మొత్తం 1,05,566 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కలిపి 94 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని 9 జిల్లాల్లో 34 కేంద్రాలు ఉన్నాయి.

629 పోస్టుల్లో ఏపీ ట్రాన్స్‌కో 200, ఏపీ ఈపీడీసీఎల్ 135, ఏపీఎస్పీడీసీఎల్ 134, ఏపీ జెన్‌కో 100, ఏపీసీపీడీసీఎల్ 60 పోస్టులు ఉన్నాయి. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు.

పరీక్షల్లో బయోమెట్రిక్ ధృవీకరణ, సీసీ కెమెరాల పర్యవేక్షణ, ఫ్రిస్కింగ్, కేంద్రస్థాయి మానిటరింగ్ వంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. విద్యుత్, నెట్‌వర్క్ సమస్యలు తలెత్తకుండా డీజీ సెట్లు, యూపీఎస్, ప్రత్యామ్నాయ నెట్‌వర్క్, అదనపు కంప్యూటర్లను సిద్ధంగా ఉంచారు.

అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని, మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, బ్లూటూత్ పరికరాలు, కాలిక్యులేటర్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని సీఎండీ స్పష్టం చేశారు. పరీక్షలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

పరీక్ష అనంతరం మూడు రోజుల్లో ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల చేసి, ఏడు రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ చివరి వారంలో ఫైనల్ ఆన్సర్ కీ, నార్మలైజ్డ్ స్కోర్లు, మెరిట్ జాబితా విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు శివశంకర్ లోతేటి వెల్లడించారు.

Tags:    

Similar News