Renigunta: గంగమ్మ జాతరలో ఘర్షణలు: 13 మందిపై కేసులు, రిమాండ్!
Renigunta: రేణిగుంట గంగమ్మ జాతరలో బహిరంగంగా ఘర్షణలకు పాల్పడిన వేణుగోపాలపురం, జ్యోతినగర్‌కు చెందిన 13 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Renigunta: గంగమ్మ జాతరలో ఘర్షణలు: 13 మందిపై కేసులు, రిమాండ్!
రేణిగుంట: గంగమ్మ జాతర సందర్భంగా బహిరంగ ప్రదేశంలో గొడవలకు పాల్పడిన రెండు వర్గాలపై రేణిగుంట పోలీసులు కేసులు నమోదు చేసి, నిందితులను రిమాండ్‌కు తరలించారు.వేణుగోపాలపురం, జ్యోతినగర్‌కు చెందిన మొత్తం 13 మందిపై పరస్పర ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
జాతర సమయంలో చిన్నపాటి వ్యక్తిగత వివాదాలను పెద్దవిగా చేసుకుని పరస్పరం దాడులు, దూషణలు,బెదిరింపులకు పాల్పడితే ఇకపై ఉపేక్షించేది లేదని రేణిగుంట పోలీసులు స్పష్టం చేశారు.గొడవలకు దిగితే కేసులు.. రిమాండ్ తప్పదు అంటూ యువతకు గట్టి హెచ్చరిక జారీ చేశారు.
ప్రజాశాంతికి విఘాతం కలిగించేలా బహిరంగ ప్రదేశాల్లో కొట్లాటలకు పాల్పడినా,ఇతరులను రెచ్చగొట్టినా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.వ్యక్తిగత వివాదాలను చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా పోలీసులను ఆశ్రయించి పరిష్కరించుకోవాలని సూచించారు.జాతరలు,బహిరంగ కార్యక్రమాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని రేణిగుంట పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జయచంద్ర హెచ్చరించారు. యువత సంయమనం పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.