Mahabubabad: పోలీస్ స్టేషన్‌కు పనిలేదు.. ఘటన స్థలంలోనే ఎఫ్‌ఐఆర్
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా పోలీసులు "ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్" విధానం ద్వారా బాధితుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు నమోదు చేస్తున్నారు.
Mahabubabad: పోలీస్ స్టేషన్‌కు పనిలేదు.. ఘటన స్థలంలోనే ఎఫ్‌ఐఆర్
Mahabubabad: బాధితులకు సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో మహబూబాబాద్ జిల్లా పోలీసులు అమలు చేస్తున్న “ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్” విధానం ద్వారా ప్రజలకు మరింత చేరువగా పోలీస్ సేవలు అందుతున్నాయి. పోలీస్ స్టేషన్‌కు రాలేని పరిస్థితుల్లో ఉన్న బాధితులు స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేకుండా, పోలీసులు స్వయంగా ఘటన స్థలానికి లేదా బాధితుని వద్దకు వెళ్లి ఫిర్యాదు నమోదు చేయడం ఈ విధానం ప్రత్యేకత.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 35 ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ విధానం వల్ల బాధితులకు తక్షణ న్యాయం అందడమే కాకుండా, పోలీస్ సేవలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతోందని అన్నారు.
ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగల ప్రధాన అంశాలు మహిళలు మరియు చిన్నారులపై నేరాలు, లైంగిక నేరాలు (POCSO, అత్యాచారం తదితరాలు, ఎస్సీ / ఎస్టీ అఘాయిత్యాలు, ఆస్తి సంబంధిత నేరాలు చోరీ, దోపిడీ, వృద్ధులపై నేరాలు, ప్రత్యేక చట్టాల కింద కేసులు డౌరీ, చైల్డ్ మ్యారేజ్, ర్యాగింగ్ మొదలైనవి, పోలీస్ స్టేషన్‌కు రాలేని పరిస్థితిలో ఉన్న బాధితులకు సంబంధించిన ఇతర నేరాలు. ప్రత్యేకించి మహిళలు, వృద్ధులు మరియు దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ సేవ ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోందని ఎస్పీ తెలిపారు.
బాధితుని వద్దకే చేరుకుని ఫిర్యాదు నమోదు చేయడం ద్వారా సమయాన్ని ఆదా చేయడంతో పాటు, నేరాలపై వేగంగా చర్యలు తీసుకునే అవకాశం కలుగుతోందని పేర్కొన్నారు. బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీస్ శాఖ లక్ష్యం. ప్రజలకు చేరువగా ఉండే పోలీసింగ్ ద్వారా వారి సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నాము, అని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా ప్రజలు ఈ సేవను వినియోగించుకుని నిర్భయంగా ముందుకు వచ్చి పోలీసులను సంప్రదించాలని ఎస్పీ కోరారు.