Karimnagar: కరీంనగర్‌లో మువ్వల సవ్వడి.. నాట్య విద్యార్థినుల గజ్జె పూజ!

Karimnagar: కరీంనగర్‌లో ఘనంగా నృత్య విద్యార్థినుల 'గజ్జె పూజ' కార్యక్రమం. ముఖ్య అతిథులుగా హాజరైన మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు.

Update: 2026-03-30 04:02 GMT

Karimnagar: కరీంనగర్‌లో మువ్వల సవ్వడి.. నాట్య విద్యార్థినుల గజ్జె పూజ!

కరీంనగర్: నేటీ అధునిక కాలంలో తెలుగు సంస్కృతిని, శాస్త్రీయ, జానపద నృత్య కళలను కాపాడుకోవల్సిన భాధ్యత మన అందరి పై ఉందని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ నగరంలో భగత్ నగర్ హరిహర అయ్యప్ప దేవాలయంలో కార్పోరేటర్ నృత్య కళాకారిణి చొప్పరి జయశ్రీ ఆద్వర్యంలో నాట్య శిక్షణ పొందిన విద్యార్థులకు " గజ్జ పూజ " కార్యక్రమం ఘనంగా జరిగింది. నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నటరాజ స్వామీకి మేయర్, డిప్యూటీ మేయర్ జ్యోతి ప్రజ్వలన చేసి గజ్జె పూజను ప్రారంభించారు. శాస్త్రియ నృత్యం నేర్చుకున్న విద్యార్థినిలు తొలి ప్రదర్శన కు ముందు నటరాజ స్వామీ వద్ద గజ్జె పూజ చేసి...గురువు నాట్య కళాకారిణి చొప్పరి జయశ్రీ ఆశీర్వాదం తీస్కున్నారు. లలిత కళలో శిక్షణ పొందిన విద్యార్థినిలను మేయర్, డిప్యూటీ మేయర్లు అభినందించారు. అనంతరం నృత్య విద్యార్థుల నాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం ముఖ్య అతిథులు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ను కార్పోరేటర్ చొప్పరి జయశ్రీ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేవి లలిత కళలు..

మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. శాస్త్రీయ నాట్య కళలకు నేటికీ ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాన్ని చాటి చెప్పెవి లలిత కళలని అన్నారు. నేటి ఆధునిక కాలంలో నృత్య కళలను కాపాడుకొవాల్సిన భాధ్యత మనందరి పై ఉందని తెలిపారు. నృత్య కళ తెలుగు సంస్కృతి ని చాటి చెప్పడమే కాకుండా.. శారీరక మానసిక ఉల్లాసాన్ని కూడ కలిగిస్తుందని తెలిపారు. భారతదేశ సంస్కృతి లో లలిక కళలు చాలా ప్రాముఖ్యత కలిగినవని అన్నారు.ఇలాంటి కళలను చొప్పరి జయశ్రీ లాంటి కళాకారులు భావితరాలకు అందిస్తూ.. చైతణ్యవంతులను చేయడం అభినందనీయం అన్నారు. సంగీత లయకు అనుగుణంగా శరీర కదలికలతో భావాలను, కథలను వ్యక్త పరిచే అద్భుతమైన ప్రదర్శన నాట్య కళ అన్నారు.

భారతదేశం లలిత కళలకు పుట్టినిల్లు..

డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. శారీరక ఆరోగ్యం.. మానసిక ఉల్లాసం భావోద్వేగ వ్యక్తీకరణ, సంస్కృతిని తెలియజేయడంలో లలిత కళలు ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపారు. భరతనాట్యం, కథక్, కూచిపూడి, కథాకళి లాంటి శాస్త్రీయ నృత్యాలను కాపాడుకోవాలని అన్నారు. ప్రాచీన కాలం నుండే నాట్య కళలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని.. నేటి ఆధునిక కాలంలో కూడ నాట్య కళలకు ప్రాధాన్యత లబిస్తుందంటే జయశ్రీ లాంటి కళాకారుల కృషి ఫలితమే అన్నారు. ఎంతో శ్రద్దతో చాలా మంది చిన్నారు నృత్య కళలను ఆసక్తిగా నేర్చుకొని ప్రధర్శించడం చాలా అభినంనీయం అన్నారు. నృత్య కళలను ప్రదర్శించే ముందు కళాకారులకు గజ్జె పూజ అనేది చాలా విశిష్టమైందని తెలిపారు. లలిత కళల ద్వారా విద్యార్థుల్లో శారీరక మానసిక ఉల్లాసం పెరగడంతో పాటు ఒక క్రమశిక్షణ అలవాటు అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ చొప్పరి జయశ్రీ, వేణు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags:    

Similar News