Karimnagar: కార్మికుల గొంతు నొక్కడమేనా ప్రజాస్వామ్యం? నేతల ఆగ్రహం!
Karimnagar: కరీంనగర్‌లో భవన నిర్మాణ కార్మికుల అరెస్టులు. హైదరాబాద్ ధర్నాకు వెళ్తున్న సిఐటియు నేతలను అడ్డుకున్న పోలీసులు.
Karimnagar: కార్మికుల గొంతు నొక్కడమేనా ప్రజాస్వామ్యం? నేతల ఆగ్రహం!
కరీంనగర్: భవన నిర్మాణ కార్మికుల చలో లేబర్ ఆఫీస్ హైదరాబాద్ కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు. సిఐటియు ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమానికి వెళ్తున్న కార్మికులను కార్యకర్తలను నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ముందస్తుగా కొంతమంది నాయకులను ఇంటివద్దని ఔషధ రెస్ట్ చేసిన పోలీసులు.
అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు..
సిఐటియు జిల్లా జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల రమేష్ సహాయ కార్యదర్శి పున్నం రవి మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలపడానికి వెళ్తున్న కార్యకర్తలను పోలీసులు అక్రమంగా ఆగస్టు చేయడానికి ఈ విధంగా ఖండిస్తున్నామన్నారు. మొన్న ఆశా కార్యకర్తలను నేడు భవన నిర్మాణ కార్మికులను పోలీసు వ్యవస్థతో అణగదొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. రహస్యంగా సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వానికి తెలిసే విధంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తే అడ్డుకోవడం హాస్యాస్పదమన్నారు. లేబర్ కోడు రద్దుకు, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని తక్షణమే అరెస్టు చేసిన కార్మికులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ కరీంనగర్ జిల్లా పబ్లిక్ ప్రైవేటు రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పున్నం రవి, నాయకులు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.