Kamareddy: గిర్ని తండాలో పశువులకు హెల్త్ చెకప్.. రైతులకు భారీ ఊరట!

Kamareddy: కామారెడ్డి జిల్లా మొహమ్మద్ నగర్ మండలం గిర్ని తండాలో పిట్లం ఏఎంసీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు.

Update: 2026-03-31 05:38 GMT

Kamareddy: గిర్ని తండాలో పశువులకు హెల్త్ చెకప్.. రైతులకు భారీ ఊరట!

Kamareddy: మొహమ్మద్ నగర్ (కామారెడ్డి) మొహమ్మద్ నగర్ మండలం గిర్ని తండా లోని గ్రామ పంచాయతీ ఆవరణలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి రైతుల నుంచి విశేష స్పందన లభించింది. పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ చీకటి మనోజ్ కుమార్, సర్పంచ్ మరోని బాయి,మండల అధ్యక్షుడు రవీందర్ చేతుల మీదుగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో పశు సంవర్ధక రంగాన్ని బలోపేతం చెయ్యడం, పశువుల ఆరోగ్యాన్ని కాపాడడం ప్రధాన లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చైర్మన్ తెలిపారు. శిబిరానికి పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు హాజరై తమ పశువులకు వైద్య పరీక్షలు చేయించుకొని , ఉచితంగా మందులు పొందారు. పశువులకు వచ్చే వివిధ వ్యాధుల పై పరీక్షలు నిర్వహించడంతోపాటు వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పశు వైద్యులు రైతులకు అవగాహన కల్పించారు.

పశు సంవర్ధకం పై రైతులు శ్రద్ధ పెట్టాలి.

రైతులు పశు సంవర్ధకం పై మరింత శ్రద్ధ పెట్టాలని, పశువుల ఆరోగ్యం రైతుల ఆర్థికాభివృద్ధికి కీలకమని ఇలాంటి ఉచిత పశు వైద్య శిబిరాలు తరచుగా నిర్వహించడం ద్వార గ్రామీణ ప్రాంతాల్లో పశువుల సంరక్షణ మరింత మెరుగుపడుతుందని మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ తెలిపారు. ఈ శిబిరాన్ని మార్కెట్ కమిటీ సిబ్బంది సమర్థవంతంగా నిర్వహించారు.

ఉచిత పశు వైద్య శిబిరంలో పాల్గొన్న పశు వైద్యులు, స్థానిక ప్రతినిధులు.

మొహమ్మద్ నగర్ మండలం గిర్ని తండాలో మంగళవారం నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరం లో గిర్ని తండా సర్పంచ్ మరోని బాయి, సింగీతం సర్పంచ్ రఫీ, మొహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు సవాయి సింగ్, పశు వైద్య శాఖ అధికారి డాక్టర్. సయ్యద్ యూనిస్, మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంతోష్ రాథోడ్, ఎ. ఎం. సి డైరక్టర్ కృష్ణ, బలరాం, కార్యదర్శి శ్రీకాంత్, సూపర్ వైజర్ నాగరాజ్, గోపాల మిత్ర నందు, సిద్ధు, రఘు లతోపాటు మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News