Vikarabad: దొడ్డి కొమురయ్య జయంతి కలెక్టరేట్‌లో నివాళులు

Vikarabad: తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకుని జిల్లా అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ ఘన నివాళులర్పించారు.

Update: 2026-04-03 11:47 GMT

Vikarabad: దొడ్డి కొమురయ్య జయంతి కలెక్టరేట్‌లో నివాళులు

Vikarabad: దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశం హాలు నందు బి సి వెల్ఫేర్ అధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా ఆయనకు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి వీరమరణం పొందిన యోధుడిగా దొడ్డి కొమురయ్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని, ఆయన ధైర్యం, త్యాగం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం మనకు స్ఫూర్తిదాయకం అని అన్నారు.

రాజకీయ, సామాజిక రంగాలలో అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన కొమురయ్య గారి ఆశయాలు నేటికీ ప్రసంగించు కుంటున్నామని, రైతుల హక్కులు, పేదల సంక్షేమం కోసం ఆయన చేసిన త్యాగం ఎప్పటికీ మరువ లేనిదన్నారు.

ఈ సందర్భంలో యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందుతూ సమాజంలో న్యాయం, సమానత్వం కోసం కృషి చేయాలని,ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో బి సి వెల్ఫేర్ అధికారి మాధవ రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News