Thotapalli: ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు

Thotapalli: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవం మరియు ఐదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభ ఘనంగా జరిగింది.

Update: 2026-04-03 13:22 GMT

Thotapalli: ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు

Thotapalli: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం మరియు పాఠశాల వార్షికోత్సవ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ బంక లక్ష్మీ చందు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు చిన్ననాటి నుండే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానికి అనుగుణంగా క్రమశిక్షణతో కృషి చేస్తే ఉన్నత స్థానాలు సాధించగలరని తెలిపారు. అలాగే తల్లిదండ్రులు, గురువులు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను ఉద్దేశించి సూచించారు.

అనంతరం పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా నృత్యాలు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఆటలు, పాటలతో కార్యక్రమం సందడిగా కొనసాగింది. ఐదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు కేక్ కట్ చేసి తినిపించి వీడ్కోలు పలికారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పాఠశాల హెచ్ఎం గాంధీ, ఉపాధ్యాయులు గాజుల భాగ్యలక్ష్మి, పోషవేణి రాధిక, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News