Chitra Mishra: ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
Chitra Mishra; ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.
Chitra Mishra: ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
సూర్యాపేట/జిల్లా ప్రతినిధి: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 233 మంది అర్జీదారులు ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించగా మరికొన్నింటిని అధికారులకు బదిలీ చేశారు. త్వరితగతిన దరఖాస్తులు పరిష్కరించాలని, పెండింగ్ లో ఉంచవద్దని కలెక్టర్ ఆదేశించారు.
ప్రజలు ప్రజావాణి సద్వినియోగం చేసుకోవాలి..
ప్రజా సమస్యలపై ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజావాణిలో తక్షణమే పరిష్కరించే కేసులను అక్కడే పరిష్కరించి మిగతా వాటిని సంబంధిత శాఖలకు పంపించారు. అధికారులు ఫిర్యాదు దారుల నుండి స్వీకరించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలు తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు వాటిని పరిష్కరించే దిశగా ఆలోచించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబు పాల్గొన్నారు.