Veldanda: క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య పుట్టా రాంరెడ్డి ఆగ్రహం
Veldanda: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పుట్టా రాంరెడ్డి కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు.
Veldanda: క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య పుట్టా రాంరెడ్డి ఆగ్రహం
Veldanda: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో :మాజీ సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయం పై కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దాడి చేయడం హేమమైన చర్య అని మాజీ ఎంపీపీ బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పుట్ట రాంరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి పుట్ట రాంరెడ్డి మాట్లాడుతూ,
ఈ దాడి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం పై జరిగిన దాడిగా క్యాంపు కార్యాలయంలో అక్కడ ఎమ్మెల్యే కేసీఆర్ ఫోటో పెట్టకుండా సీఎం ఫోటో పెట్టడం ఏమిటని ఎమ్మెల్యే ఫోటో ఉండకూడదా అని ప్రశ్నించారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఎంపీల అధికార నివాసంలో ఎంపీల ఫోటో లేకుండా ప్రధాని మోడీ ఫోటో పెట్టగలరా క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలంటే అధికారులే పెట్టొచ్చు కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని
వెంటనే ఎటువంటి పనులు మానుకోవాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు చంద్రమోహన్ రెడ్డి, జోగయ్య, లింగం ముదిరాజు, పోలె అశోక్, నిరంజన్,సత్యం,రవిలతో పాటు తదితరులున్నారు.