IP69K రేటింగ్.. ఏకంగా 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో ‘ఒప్పో రెనో 16 ప్రో’ లాంచ్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో చైనాలో నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్‌లో తన మోస్ట్ అవేటెడ్ ‘ఒప్పో రెనో 16’ , ‘ఒప్పో రెనో 16 ప్రో’ స్మార్ట్‌ఫోన్లను..
OPPO-Reno-16-Pro
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో చైనాలో నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్‌లో తన మోస్ట్ అవేటెడ్ ‘ఒప్పో రెనో 16’ , ‘ఒప్పో రెనో 16 ప్రో’ స్మార్ట్‌ఫోన్లను అధికారికంగా విడుదల చేసింది. వీటితో పాటు సరికొత్త ఫ్లాగ్‌షిప్ టాబ్లెట్ ‘ఒప్పో ప్యాడ్ 6’ ను కూడా కంపెనీ ఆవిష్కరించింది. ప్రీమియం లుక్, మూడు ఆకర్షణీయమైన రంగులు, ఏకంగా 16GB వరకు భీభత్సమైన ర్యామ్ సామర్థ్యంతో ఈ ఫోన్లు మార్కెట్లోకి అడుగుపెట్టాయి. మునుపటి మోడళ్ల లాగే ఈసారి కూడా ప్రో మోడల్‌లో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించడం విశేషం.
ధరలు , లభ్యత వివరాలు
ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్లు మే 29 నుండి చైనాలోని ఒప్పో ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అమ్మకానికి రానున్నాయి. ఒప్పో రెనో 16 బేస్ వేరియంట్ (12GB + 256GB) ధర 3,499 యువాన్లు (సుమారు రూ. 49,000) గా ఉండగా, దీని టాప్ వేరియంట్ (16GB + 1TB) ధర 4,899 యువాన్లు (సుమారు రూ. 69,000) గా నిర్ణయించారు. మరోవైపు, ప్రీమియం మోడల్ అయిన ఒప్పో రెనో 16 ప్రో ప్రారంభ ధర 4,499 యువాన్లు (సుమారు రూ. 63,000) గా ఉంది. దీని టాప్ ఎండ్ వేరియంట్ (16GB + 512GB) ధర 5,299 యువాన్లు (సుమారు రూ. 74,000) పలుకుతోంది. కలర్స్ విషయానికి వస్తే, రెనో 16 మోడల్ గెలాక్సీ పర్పుల్, హార్ట్‌బీట్, మూన్‌లైట్ ఈజ్ డార్క్ రంగుల్లో లభిస్తుంది. ప్రో మోడల్ డ్రీమ్ వైట్, హార్ట్‌బీట్, మూన్‌లైట్ ఈజ్ డార్క్ షేడ్స్‌లో అందుబాటులోకి రానుంది.
డిస్‌ప్లే , సాఫ్ట్‌వేర్ పవర్
ఒప్పో రెనో 16 సిరీస్ ఫోన్లు డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తాయి. ఇవి సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ ఓఎస్ 16 పై రన్ అవుతాయి. ఇందులో రెనో 16 ప్రో మోడల్ 6.78-ఇంచుల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుండగా, బేస్ మోడల్ అయిన రెనో 16 కొంచెం చిన్నదైన 6.32-ఇంచుల 1.5K ఓలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. రెండు ఫోన్లు కూడా 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ సాంప్లింగ్ రేట్ , 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అద్భుతమైన విజువల్స్ అందిస్తాయి.
మీడియాటెక్ ప్రాసెసర్లు , అత్యున్నత IP69K రేటింగ్
పర్ఫార్మెన్స్ పరంగా ఈ ఫోన్లలో నెక్స్ట్ లెవెల్ చిప్‌సెట్లను ఉపయోగించారు. ఒప్పో రెనో 16 ప్రో మోడల్ అత్యంత వేగవంతమైన ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500s ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కాగా, బేస్ మోడల్ అయిన రెనో 16 ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8550 సూపర్ ఎస్‌ఓసీ చిప్‌సెట్‌తో వస్తుంది. రెండు ఫోన్లలోనూ 16GB వరకు LPDDR5x ర్యామ్ , 1TB వరకు భారీ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. వీటన్నింటితో పాటు వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఈ సిరీస్‌కు పరిశ్రమలోనే అత్యున్నతమైన IP69K రేటింగ్ ఇచ్చారు. అంటే భారీ వర్షంలో తడిసినా, నీళ్లలో పడినా ఈ ఫోన్లకు ఏమీ కాదు.
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం 200MP ట్రిపుల్ కెమెరా మ్యాజిక్
ఒప్పో రెనో సిరీస్ అంటేనే కెమెరాలకు కేరాఫ్ అడ్రస్. ఈసారి కూడా రెండు ఫోన్లలోనూ వెనుక వైపు ఒకే రకమైన పవర్‌ఫుల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఫీచర్ గల భారీ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దీనికి తోడు గ్రూప్ ఫోటోల కోసం 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా క్యాప్చర్ చేయడానికి 3.5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ గల 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలను అమర్చారు. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ కెమెరాను ఇచ్చారు. ఈ కెమెరాల ద్వారా 4K/60 fps వేగంతో అత్యంత నాణ్యమైన వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.
మెగా బ్యాటరీ , రాకెట్ స్పీడ్ ఛార్జింగ్
బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఒప్పో ఈసారి సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేసింది. ఒప్పో రెనో 16 ప్రో మోడల్‌లో ఏకంగా 7,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని ప్యాక్ చేయగా, బేస్ మోడల్ రెనో 16 లో 6,700mAh బ్యాటరీని అందించారు. ఈ రెండు ఫోన్లు కూడా 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. అయితే, కేవలం ప్రో మోడల్‌లో మాత్రమే అదనంగా 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌ను కూడా అందించడం విశేషం. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. చైనాలో విడుదలైన ఈ సిరీస్ త్వరలోనే భారత మార్కెట్లోకి కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది.