24 గంటలు ఏసీ వాడినా.. ఈ ఒక్క పని చేస్తే కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గుతుంది.!

వేసవిలో ఏసీ వాడకం వల్ల నెలాఖరున వచ్చే కరెంట్ బిల్లు చూసి షాక్ అవుతున్నారా.? 24 గంటలు ఏసీ వాడితే ఎంత బిల్లు వస్తుంది.? దాన్ని కంట్రోల్ చేయడానికి మనం పాటించాల్సిన జాగ్రత్తలు.

Update: 2026-05-25 06:14 GMT

24 గంటలు ఏసీ వాడినా.. ఈ ఒక్క పని చేస్తే కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గుతుంది.!

AC Electricity Bill: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ఎండ వేడిని తట్టుకోలేక ఇంట్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తాం. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడానికి రోజంతా ఏసీ ఆన్ చేసి హాయిగా నిద్రపోతాం. కానీ, నెలాఖరున వచ్చే కరెంట్ బిల్లు చేసినప్పుడు మాత్రం గుండె గుబేల్‌మంటుంది. మరి ఏసీ 24 గంటలు వాడితే ఎంత కరెంట్ బిల్లు వస్తుంది.! ఒకవేళ మనం వినియోగించినా జేబుకు చిల్లు పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

సాధారణంగా మనం ఇళ్లలో 1.5 టన్ సామర్థ్యం గల 5-స్టార్ ఇన్వర్టర్ ఏసీలను ఎక్కువగా వాడుతుంటాం. ఈ ఏసీలు గంటకు సుమారు 1.2 నుంచి 1.5 యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తాయి. ఒకవేళ మనం రోజంతా ఏసీని వినియోగిస్తే.. దాదాపుగా 30 నుంచి 36 యూనిట్ల వరకు కరెంట్ ఖర్చవుతుంది. ఇక ప్రస్తుత విద్యుత్ స్లాబ్ రేట్ల బట్టి.. సగటున యూనిట్‌కు రూ. 7 నుంచి రూ. 9 వరకు లెక్కిస్తే.. రోజుకు రూ. 200 నుంచి రూ. 320 వరకు బిల్లు వస్తుంది.. అంటే.! నెల మొత్తం ఏసీ వాడినందుకు గానూ రూ. 6 వేల నుంచి రూ. 9 వేల వరకు బిల్లు వచ్చే అవకాశం ఉంది. దీనికి మిగతా గృహోపకరణాల ఖర్చు అదనం.

బిల్లు తగ్గించుకునేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు..

రూమ్ చల్లగా ఉండాలని ఏసీని 20 డిగ్రీల దిగువన ఉంచడం సరికాదు. నిర్దిష్టంగా 24 డిగ్రీలు ఆపై ఉంచితే.. కంప్రెసర్‌పై భారం తగ్గడమే కాకుండా.. 20 శాతం వరకు కరెంట్ ఆదా అవుతుంది.

ఏసీ ఆన్‌లో ఉన్నప్పుడు కిటికీలు, తలుపులు సరిగ్గా మూసి ఉన్నాయో లేదో చూసుకోవాలి. చిన్న గ్యాప్ ఉన్నా చల్లదనం బయటకు పోయి.. రూమ్ కూల్ కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

ఏసీ ఫిల్టర్లలో దుమ్ము చేరితే గాలి సరిగ్గా రాదు. అందుకే నెలకు ఒకసారి ఫిల్టర్లను శుభ్రం చేయడం, ఎండ కాలం ప్రారంభానికి ముందే సర్వీసింగ్ చేయించడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల మనం ఏసీ ఎక్కువ సేపు వినియోగించినా.. కరెంట్ బిల్లును సగానికి సగం తగ్గించుకోవచ్చు.

Tags:    

Similar News