Pat Cummins: ఐపీఎల్‌కు పోటీగా క్రికెట్ ఆస్ట్రేలియా మాస్టర్ ప్లాన్.. పాట్ కమిన్స్‌కు రూ.113 కోట్ల మెగా ఆఫర్!

Pat Cummins Get RS 113 Crore Deal From CA. ఐపీఎల్ 2026లో అదరగొడుతున్న పాట్ కమిన్స్ పేరు ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Update: 2026-05-07 14:01 GMT

Pat Cummins: ఐపీఎల్‌కు పోటీగా క్రికెట్ ఆస్ట్రేలియా మాస్టర్ ప్లాన్.. పాట్ కమిన్స్‌కు రూ.113 కోట్ల మెగా ఆఫర్!

Pat Cummins: ఆస్ట్రేలియా స్టార్ పాట్ కమిన్స్‌ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌)కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఫిట్‌నెస్‌ కారణంగా ఈ సీజన్ ఆరంభంలో ఆడని కమిన్స్‌.. ఇటీవలే జట్టులో చేరాడు. అటు బౌలర్, ఇటు సారథిగా అదరగొడుతున్నాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో (14) ఎస్‌ఆర్‌హెచ్‌ అగ్రస్థానంలో ఉంది. మరో విజయం సాధిస్తే ప్లేఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. ఐపీఎల్ 2026లో అదరగొడుతున్న కమిన్స్ పేరు ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తన స్టార్ కెప్టెన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవద్దనే ఉద్దేశంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) భారీ కాంట్రాక్ట్ ఆఫర్ చేసినట్లు ఆసీస్ మీడియా వెల్లడించింది.

‘ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ కథనం ప్రకారం.. పాట్ కమిన్స్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా మూడు సంవత్సరాల కాలానికి 12 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ.113 కోట్లు) ప్రత్యేక ఒప్పందాన్ని ఆఫర్ చేసింది. ఆసీస్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడేందుకు ఒప్పందం చేసుకొనేందుకు చూస్తోందట. 2029 వరకు ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌కు అందుబాటులో ఉండేలా ఈ ఒప్పందం రూపొందించినట్లు సమాచారం. కమిన్స్‌తో పాటు మరో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌కు కూడా ఇదే తరహా ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక మరో స్టార్ మార్నస్ లబుషేన్‌తోనూ ఇలాంటి డీల్ చేసుకోవాలని సీఏ భావిస్తుందట.

గత ఏడాది పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్‌లకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి అనుబంధ ఫ్రాంచైజీల తరఫున ఆడేందుకు ఒక్కొక్కరికి రూ.94 కోట్లకు పైగా ఆఫర్లు వచ్చాయనే వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో తమ స్టార్ ఆటగాళ్లు ఫ్రాంచైజీ క్రికెట్ వైపు పూర్తిగా వెళ్లిపోకుండా నిలబెట్టేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఈ భారీ ఆఫర్లతో ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. కొత్త ఒప్పందం అమల్లోకి వస్తే// కమిన్స్ వార్షిక ఆదాయం మరో మిలియన్ డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో అత్యధికంగా సంపాదిస్తున్న అథ్లెట్ల జాబితాలో కమిన్స్ 15వ స్థానంలో ఉన్నాడు. ఈ కాంట్రాక్ట్‌లో భాగంగా అతడు ఎన్ని మ్యాచ్‌లు ఆడినా.. స్థిరమైన చెల్లింపులు అందుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

వచ్చే 12 నెలల్లో ఆస్ట్రేలియా జట్టుకు అత్యంత బిజీ షెడ్యూల్ ఉంది. బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో స్వదేశంలో సిరీస్‌లు ఆడనున్న ఆసీస్.. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, భారత్ పర్యటనలకు కూడా వెళ్లనుంది. మొత్తం 21 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో స్టార్ ఆటగాళ్లను జట్టుతో కొనసాగించడం క్రికెట్ ఆస్ట్రేలియాకు కీలకంగా మారింది. ఈ విషయంపై సీఏ హెడ్ జేమ్స్ ఆల్సాప్ స్పందిస్తూ.. టాప్‌ ప్లేయర్లు ఆర్థికపరమైన భద్రత, మెరుగైన పారితోషికానికి అర్హులేనని. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఆటగాళ్ల విలువ పెరుగుతూనే ఉంటుందన్నారు. 'పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్ వంటి మల్టీ ఫార్మాట్ ప్లేయర్లకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. కాబట్టి వారు ఆస్ట్రేలియా క్రికెట్‌కే కట్టుబడి ఉండేలా చూడటం మాకు అత్యంత కీలకం' అని పేర్కొన్నారు. విండీస్ ఆటగాళ్లు టీ20 లీగ్‌లకే ప్రాధాన్యం ఇస్తుండడంతో.. జాతీయ జట్టు ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ పరిస్థితి తమకు రాకూడని ముందుగానే సీఏ జాగ్రత్త పడుతోంది.

Tags:    

Similar News