IPL: రియాన్ ప‌రాగ్ ఒక్క‌డే కాదు.. వీళ్లు కూడా లైవ్ మ్యాచ్‌లో స్మోకింగ్ చేస్తూ దొరికిపోయారు

IPL: క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో ఆటగాళ్లు చేసే ప్రతి చర్య కెమెరాల్లో రికార్డ్ అవుతుంది. తాజాగా రియాన్ ప‌రాగ్‌ చేసిన పని పెద్ద చర్చకు దారి తీసింది.

Update: 2026-04-30 10:46 GMT

IPL: రియాన్ ప‌రాగ్ ఒక్క‌డే కాదు.. వీళ్లు కూడా లైవ్ మ్యాచ్‌లో స్మోకింగ్ చేస్తూ దొరికిపోయారు

IPL: క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో ఆటగాళ్లు చేసే ప్రతి చర్య కెమెరాల్లో రికార్డ్ అవుతుంది. తాజాగా రియాన్ ప‌రాగ్‌ చేసిన పని పెద్ద చర్చకు దారి తీసింది. అయితే ఇలాంటి ఘటనలు ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలువురు ప్రముఖ ఆటగాళ్లు ఇలాంటి విషయాల్లో వార్తల్లో నిలిచారు.

రియాన్ పరాగ్ వేపింగ్ వివాదం

IPL 2026లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో వేప్ ఉపయోగిస్తున్నట్లు కెమెరాల్లో కనిపించారు. భారత్‌లో వేపింగ్ నిషేధం ఉన్న‌నేప‌థ్యంలో, ఈ సంఘటన వైరల్ అయ్యింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్న పరాగ్ జట్టు ప్రదర్శన బాగానే ఉన్నా, వ్యక్తిగతంగా మాత్రం అంతగా రాణించలేకపోతున్నాడు. ఈ ఘటన తర్వాత ఆయనపై విమర్శలు కూడా వచ్చాయి.

IPLలో ఇదే మొదటిసారి కాదు

ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయి. ఆరోన్ ఫించ్‌ 2020లో జరిగిన IPL సమయంలో వేపింగ్ చేస్తూ కెమెరాకు చిక్కాడు. ఆ సమయంలో కరోనా కారణంగా టోర్నీ యూఏఈలో జరిగింది. ఈ ఘటన కూడా అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది.

ఏబీ డివిలియర్స్ ఘటన

2026 జనవరిలో దక్షిణాఫ్రికా లీగ్ మ్యాచ్ సందర్భంగా ఏబీ డివిలియ‌ర్స్ స్టేడియంలో వేపింగ్ చేస్తూ కనిపించారు. కెమెరా తనపై పడగానే ఆయన కొంత ఇబ్బంది పడినట్లు కనిపించింది. దక్షిణాఫ్రికాలో వేపింగ్‌పై నిషేధం లేకపోయినా, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వ‌రల్డ్ కప్‌లో స్మోకింగ్ సంఘటనలు

వేపింగ్ మాత్రమే కాదు, స్మోకింగ్ ఘటనలు కూడా బయటపడ్డాయి. బ్రెడాన్ మెక్మాల్ 2015 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ సమయంలో టాయిలెట్‌లో స్మోకింగ్ చేసినట్లు స్వయంగా వెల్లడించారు. అలాగే బెన్ స్టోక్స్‌ 2019 వరల్డ్ కప్ ఫైనల్ సమయంలో లార్డ్స్ స్టేడియం వాష్‌రూమ్‌లో స్మోకింగ్ చేసినట్లు చెప్పారు.

Tags:    

Similar News