IPL 2027: వాడిని తట్టుకోవడం నావల్ల కాదు బాబోయ్.. పాట్ కమిన్స్ షాకింగ్ కామెంట్స్
IPL 2027: పాట్ కమిన్స్ ఐపీఎల్ 2027కు దూరం కానున్నాడనే వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
IPL 2027: వాడిని తట్టుకోవడం నావల్ల కాదు బాబోయ్.. పాట్ కమిన్స్ షాకింగ్ కామెంట్స్
IPL 2027: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసే ఒక చేదు నిజం వెలుగులోకి వచ్చింది. ఆరెంజ్ ఆర్మీని ముందుండి నడిపిస్తున్న స్టార్ పేసర్, జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ ఐపీఎల్ 2027 సీజన్‌కు దూరం కానున్నట్లు స్వయంగా హింట్ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్, పనిభారం (Workload) కారణంగా అతడు ఈ కఠిన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
దేశం కోసం ఐపీఎల్‌ను వదులుకుంటా.. కమిన్స్ సంచలన వ్యాఖ్యలు..
ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాట్ కమిన్స్ తన భవిష్యత్తు ప్రణాళికలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. "వచ్చే ఏడాది విపరీతమైన షెడ్యూల్ కారణంగా నేను ఏదో ఒక టోర్నమెంట్‌కు దూరం కావాల్సి ఉంటుంది. అయితే నా దేశం తరపున ఆడే టెస్ట్ మ్యాచ్‌లను గానీ, వన్డే ప్రపంచ కప్‌ను గానీ నేను వదులుకోను. సమయం వచ్చినప్పుడు నా ఐపీఎల్ ఫ్రాంచైజీ హైదరాబాద్ యాజమాన్యంతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటాను. ప్రస్తుతానికైతే పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు." అని కమిన్స్ స్పష్టం చేశాడు.
15 ఏళ్ల కుర్రాడి దెబ్బకు భయపడే తప్పుకుంటున్నాడా? నెటిజన్ల ట్రోల్స్..
పాట్ కమిన్స్ ఐపీఎల్ 2027కు దూరం కానున్నాడనే వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఐపీఎల్ 2026 సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ దెబ్బకు భయపడే కమిన్స్ వచ్చే ఏడాది ఆడటం లేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
గాయం నుంచి కోలుకుని రాజస్థాన్‌తో ఆడిన మ్యాచ్‌లో కమిన్స్ వేసిన తొలి బంతికే వైభవ్ సిక్స్ బాది షాకిచ్చాడు. ఆ తర్వాత ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ ఏకంగా 97 పరుగులు చేసి ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. మ్యాచ్ అనంతరం కమిన్స్ స్వయంగా మాట్లాడుతూ.. "వైభవ్ లాంటి ఆటగాడిని నా కెరీర్‌లో చూడలేదు. అతడికి బౌలింగ్ చేయాలంటేనే వెన్నులో వణుకు పుడుతోంది" అని వ్యాఖ్యానించడం విశేషం. ఈ దెబ్బతోనే కమిన్స్ ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పాలనుకుంటున్నాడని నెటిజన్లు సరదాగా అంటున్నారు.
ముంబై ఇండియన్స్ మాదిరిగా హైదరాబాద్‌కూ కొత్త కెప్టెన్?
ఐపీఎల్ 2026 సీజన్‌లో పాట్ కమిన్స్ గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరం కావడంతో ఇషాన్ కిషన్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. కమిన్స్ సారథ్యంలో జట్టు టాప్-4 కు చేరినప్పటికీ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిపోయింది. ఒకవేళ ఐపీఎల్ 2027 సీజన్‌కు కమిన్స్ అందుబాటులో లేకపోతే, ఇషాన్ కిషన్‌కు పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
పాట్ కమిన్స్ లాంటి ప్రపంచస్థాయి లీడర్ జట్టుకు దూరం కావడం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పెద్ద ఎదురుదెబ్బే. అయితే, దేశం కోసం లీగ్ క్రికెట్‌ను పక్కన పెట్టాలనుకునే అతడి నిర్ణయాన్ని గౌరవించాల్సిందే. మరి కమిన్స్ స్థానాన్ని భర్తీ చేస్తూ వచ్చే ఏడాది హైదరాబాద్ జట్టును ఇషాన్ కిషన్ ఎలా నడిపిస్తాడో చూడాలి.