Ashirvad Sooryavanshi: అన్నే అంటే, తమ్ముడు ఇంకా దారుణంగా ఉన్నాడు.. 19 ఫోర్లు, 6 సిక్సర్లతో వీరవిహారం!

Ashirvad Sooryavanshi: Ashirvad Sooryavanshi Hits 168 Runs. వైభవ్ కాదు.. అతని తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌తో వార్తల్లో నిలిచాడు.

Update: 2026-06-24 13:30 GMT

Ashirvad Sooryavanshi: అన్నే అంటే, తమ్ముడు ఇంకా దారుణంగా ఉన్నాడు.. 19 ఫోర్లు, 6 సిక్సర్లతో వీరవిహారం!

Ashirvad Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో బిజీ బిజీగా ఉన్నాడు. జూన్ 26 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్ కోసం భారత జట్టుతో కలిసి ఐర్లాండ్‌కు చేరుకున్న ఈ 15 ఏళ్ల స్టార్‌పై అందరి దృష్టి ఉంది. అయితే ఇప్పుడు మరో సూర్యవంశీ పేరు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైభవ్ కాదు.. అతని తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌తో వార్తల్లో నిలిచాడు.

ఆశీర్వాద్ సూర్యవంశీ ఇటీవల జరిగిన ఓ మ్యాచ్‌లో 119 బంతుల్లో 168 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు, 6 భారీ సిక్సర్లు బాదాడు. సమస్తిపూర్‌లో రుయిషావ్ ఎలెవన్ తరఫున ఆడిన ఆశీర్వాద్.. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆశీర్వాద్ చెలరేగడంతో రుయిషావ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఈ స్కోర్‌ కార్డ్‌ను వైభవ్ సూర్యవంశీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. చిన్న వయసులోనే మరో సూర్యవంశీ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటంతో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'ఇంట్లోనే మరో స్టార్ తయారవుతున్నాడు', 'అన్నను మించిన తమ్ముడు అవుతాడేమో' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అన్నయ్య ఉజ్జ్వల్ సూర్యవంశీ తన తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ ఇన్నింగ్స్ స్కోర్‌ కార్డ్‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా పంచుకున్నారు. ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ కూడా అదే స్టోరీని పంచుకుని.. తన తమ్ముడి విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. ఇటీవల జరిగిన ఒక ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా ఆశీర్వాద్ సెంచరీ చేశాడు. 87 బంతుల్లో 20 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 103 రన్స్ బాదాడు. క్రికెట్ అకాడమీ తాజ్‌పూర్ తరఫున ఆశీర్వాద్ ఈ శతకం చేశాడు. ఈ ఇన్నింగ్స్‌పై అతని సోదరులు వైభవ్, ఉజ్జ్వల్ సహా తండ్రి సంజీవ్ సూర్యవంశీ కూడా సంతోషం వ్యక్తం చేశారు.

ఇక వైభవ్ సూర్యవంశీ విషయానికి వస్తే.. గత రెండేళ్లలో అతని కెరీర్ అద్భుతంగా సాగింది. ఐపీఎల్ 2025లో భారత ఆటగాడిగా అత్యంత వేగవంతమైన శతకం నమోదు చేసిన వైభవ్.. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం ఐపీఎల్ 2026లో 776 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచి భారత సీనియర్ జట్టులో చోటు సంపాదించాడు. వైభవ్ ఐర్లాండ్‌పై అరంగేట్రం చేసే అవకాశాల నేపథ్యంలో యూరప్ అంతటా అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. మాజీ భారత, ఐర్లాండ్ క్రికెటర్ ఎంవీ నరసింహ రావు మాట్లాడుతూ.. వైభవ్ ఆడే అవకాశంతో బెల్‌ఫాస్ట్‌లోని స్టోర్మోంట్ మైదానానికి టికెట్ల డిమాండ్ అమాంతం పెరిగిందని తెలిపారు. యూరప్‌లోని ఇతర దేశాల నుంచి కూడా అభిమానులు మ్యాచ్ వీక్షించేందుకు రావాలని ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.



 


Tags:    

Similar News