Sunny Deol: కోర్టు రూమ్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఇక్కా’.. ఓటీటీ డేట్ ఫిక్స్!

Sunny Deol: బాలీవుడ్ యాక్షన్ కింగ్ సన్నీ డియోల్, వెర్సటైల్ యాక్టర్ అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా హై-వోల్టేజ్ లీగల్ డ్రామా చిత్రం ‘ఇక్కా’.

Update: 2026-06-13 13:29 GMT

Sunny Deol: కోర్టు రూమ్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఇక్కా’.. ఓటీటీ డేట్ ఫిక్స్!

Sunny Deol: బాలీవుడ్ యాక్షన్ కింగ్ సన్నీ డియోల్, వెర్సటైల్ యాక్టర్ అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా హై-వోల్టేజ్ లీగల్ డ్రామా చిత్రం ‘ఇక్కా’. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ శనివారం ఈ ఒరిజినల్ ఫిల్మ్ యొక్క అధికారిక విడుదల తేదీని అనౌన్స్ చేసింది. ‘మహారాజ్’ (2024), ‘వి ఆర్ ఫ్యామిలీ’ (2010) చిత్రాల ఫేమ్ సిద్ధార్థ్ పి మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూలై 10వ తేదీ నుండి నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

మైండ్ గేమ్‌లతో సాగే కోర్టు రూమ్ డ్రామా!

ఒక పవర్‌ఫుల్ కోర్టు రూమ్ డ్రామాగా రూపొందిన ‘ఇక్కా’ కథ అత్యంత ఆసక్తికరమైన మైండ్ గేమ్‌లతో సాగనుంది. ఇందులో సన్నీ డియోల్ సమాజంలో ఎంతో సక్సెస్ ఫుల్, న్యాయబద్ధంగా ఉండే ఒక సీనియర్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. అయితే, ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి (అక్షయ్ ఖన్నా) తరపున వాదించవలసిందిగా ఆయనపై తీవ్రమైన ఒత్తిడి వస్తుంది.

ఇక్కడే అసలైన ట్విస్ట్ ఏంటంటే.. ఆ నిందితుడు మరెవరో కాదు, గతంలొ ఇదే లాయర్ వల్ల కెరీర్ కోల్పోయి రోడ్డున పడ్డ వ్యక్తి. ఇప్పుడు తన పాత శత్రువును కాపాడటం కోసం, ఎలాగైనా ఆ కేసును గెలిపించడం కోసం ఆ లాయర్ చట్టంలోని లొసుగులన్నింటినీ ఉపయోగించాల్సి వస్తుంది. ఒకవేళ ఆ కేసులో ఓడిపోతే, తను ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమించే ప్రతి ఒక్కరినీ కోల్పోవాల్సి వస్తుంది. ఈ క్లిష్టమైన చెస్ గేమ్ లాంటి లీగల్ బ్యాటిల్‌లో చివరకు ఎవరు గెలిచారు? అనే పాయింట్‌తో సినిమా నడుస్తుంది.

భారీ నటీనటులు.. బలమైన సాంకేతిక బృందం

దర్శకత్వంతో పాటు సిద్ధార్థ్ పి మల్హోత్రా ఈ చిత్రానికి సహ నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ లీగల్ థ్రిల్లర్‌లో తిల్లోతమా శోమే, ఆకాంక్ష రంజన్ కపూర్, సంజీదా షేక్, జ్యోతి ముఖర్జీ, శిశిర్ శర్మ , దియా మీర్జా కీలక పాత్రల్లో నటించారు.

టాప్ క్లాస్ టెక్నికల్ టీమ్: జిష్ణు భట్టాచార్జీ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి శ్వేతా వెంకట్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. మయూర్ శర్మ ప్రొడక్షన్ డిజైనర్‌గా, శీతల్ ఇక్బాల్ శర్మ కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేశారు. ఇక కోర్టు రూమ్ డ్రామాను నెక్స్ట్ లెవెల్‌కు ఎలివేట్ చేయడానికి జూలియస్ ప్యాకియం అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.

సన్నీ డియోల్ ‘బ్యాక్ టు బ్యాక్’ ధమాకా

ప్రస్తుతం సన్నీ డియోల్ బాక్సాఫీస్ వద్ద ఫుల్ జోష్‌లో ఉన్నారు. జూలై 10న నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఇక్కా’ విడుదలతో డిజిటల్ స్క్రీన్‌పై అలరించడమే కాకుండా.. థియేటర్లలో మరో భారీ విద్వంసానికి ఆయన సిద్ధమవుతున్నారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఆయన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘బట్వారా 1947’ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ‘ఇక్కా’ లీగల్ డ్రామాపై బాలీవుడ్ సర్కిల్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags:    

Similar News