ఓటీటీలోకి వచ్చేసిన మోస్ట్ అవేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ ‘రాఖ్’.. తెలుగులోనూ స్ట్రీమింగ్!

Raakh: సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘రాఖ్’ ఎట్టకేలకు డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చేసింది.

Update: 2026-06-12 06:35 GMT

ఓటీటీలోకి వచ్చేసిన మోస్ట్ అవేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ ‘రాఖ్’.. తెలుగులోనూ స్ట్రీమింగ్!

Raakh: సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘రాఖ్’ ఎట్టకేలకు డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చేసింది. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ అలీ ఫజల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ హై-వోల్టేజ్ సిరీస్ నేటి నుంచే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో అధికారికంగా స్ట్రీమింగ్ అవుతోంది.

దేశాన్ని కుదిపేసిన యథార్థ గాథ ఆధారంగా..

సూపర్ హిట్ సిరీస్ ‘పాతాళ్ లోక్’ ఫేమ్ దర్శకుడు ప్రోసిత్ రాయ్ ఈ సిరీస్‌ను అద్భుతంగా తెరకెక్కించారు. 1970వ దశకం చివర్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, యావత్ భారతదేశాన్ని కుదిపేసిన ‘రంగా-బిల్లా’ నిజ జీవిత కేసు ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించడం విశేషం. మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లుగా రూపొందిన ఈ సిరీస్, ఇద్దరు నగరానికి చెందిన యువతీ యువకుల దారుణ కిడ్నాప్ మరియు హత్య చుట్టూ తిరుగుతుంది. ఈ ఘోరానికి ఒడిగట్టిన నేరస్థులను పట్టుకోవడానికి ఒక యువ పోలీస్ ఆఫీసర్ దేశవ్యాప్తంగా సాగించిన తీవ్రమైన వేట, ఆనాటి దర్యాప్తు తీరును ఈ సిరీస్ కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.

పవర్‌ఫుల్ పాత్రలో అలీ ఫజల్.. సీనియర్ నటీనటుల మెరుపులు

ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో అలీ ఫజల్ సబ్ ఇన్‌స్పెక్టర్ జయప్రకాష్ జాతవ్ అనే పవర్‌ఫుల్ , సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. కేసును ఛేదించడానికి ఆయన చేసే ప్రయత్నాలు, నటన సిరీస్‌కే హైలైట్‌గా నిలిచాయి. అలాగే సుదీర్ఘ విరామం తర్వాత సీనియర్ నటి సోనాలి బింద్రే, అమీర్ బషీర్ ఈ సిరీస్‌లో కీలక పాత్రలు పోషించారు. బాధితుల తరఫున కన్నవారి ఆవేదనను ప్రతిబింబించేలా వీరిద్దరూ పండించిన భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

పాత కాలపు వాతావరణం.. రీజినల్ లాంగ్వేజెస్ లో లభ్యం

1978 నాటి కాలపరిస్థితులను, ఆనాటి లొకేషన్లను ఎంతో సహజంగా ప్రొడక్షన్ డిజైన్ ద్వారా స్క్రీన్‌పై పునఃసృష్టించారు. దీనికి తోడు ఉత్కంఠ రేకెత్తించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, నటీనటుల పెర్ఫార్మెన్స్ వెబ్ సిరీస్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లాయి. క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ కథలను ఇష్టపడే వారికి ‘రాఖ్’ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. హిందీతో పాటు తెలుగు, తమిళం , ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ఈ సిరీస్ అందుబాటులోకి రావడం విశేషం. థ్రిల్లర్ జోనర్ ఇష్టపడేవారు ప్రైమ్ వీడియోలో దీనిని వీక్షించవచ్చు.

Tags:    

Similar News