ఓటీటీలోకి వచ్చేస్తున్న మోహన్‌లాల్ ‘దృశ్యం 3’!

Drishyam 3: మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా భారతీయ సినీ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీగా గుర్తింపు తెచ్చుకున్న ‘దృశ్యం’ మూడో భాగం.

Update: 2026-06-13 06:47 GMT

ఓటీటీలోకి వచ్చేస్తున్న మోహన్‌లాల్ ‘దృశ్యం 3’!

Drishyam 3: మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా భారతీయ సినీ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీగా గుర్తింపు తెచ్చుకున్న ‘దృశ్యం’ మూడో భాగం డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయడానికి సిద్ధమైంది. కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ కథానాయకుడిగా, క్రియేటివ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ మేకింగ్‌లో వచ్చిన ‘దృశ్యం 3’ థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత ఇప్పుడు ఓటీటీ విడుదలకు డేట్ లాక్ చేసుకుంది.

జూన్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్!

ఈ క్రేజీ క్రైమ్ డ్రామా అధికారిక డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు సొంతం చేసుకుంది. జూన్ 18వ తేదీ నుండి ‘దృశ్యం 3’ వరల్డ్ వైడ్‌గా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గతంలో వచ్చిన ‘దృశ్యం 2’ నేరుగా ప్రైమ్ వీడియోలోనే రిలీజ్ కాగా, ఈ మూడో భాగాన్ని మాత్రం థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకువస్తున్నారు.

ఈసారి జార్జ్‌కుట్టి ఎదుర్కొన్న సవాల్ ఏంటి?

‘దృశ్యం 2’ ముగిసిన ఐదేళ్ల తర్వాత జార్జ్‌కుట్టి జీవితం పైకి చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. తను అనుకున్నట్లుగానే తన గతాన్ని ఒక విజయవంతమైన సినిమాగా మార్చి, సక్సెస్‌ఫుల్ ఫిల్మ్ ప్రొడ్యూసర్‌గా ఎదుగుతాడు. అయితే, వరుణ్ తల్లిదండ్రులు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ.. ఎలాగైనా జార్జ్‌కుట్టి కుటుంబాన్ని ఇరికించాలని చూస్తారు.

ఇందుకోసం వారు సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ సహదేవన్‌తో చేతులు కలుపుతారు. జార్జ్‌కుట్టి పెద్ద కుమార్తె అంజును ఒక తప్పుడు కేసులో ఇరికించి, కుటుంబాన్ని మానసికంగా దెబ్బతీయాలని ప్లాన్ చేస్తారు. ఈ క్లిష్ట పరిస్థితి నుండి తన భార్యాపిల్లలను కాపాడుకోవడానికి జార్జ్‌కుట్టి ఎలాంటి షాకింగ్ , తుది నిర్ణయం తీసుకున్నాడు? ఈసారి పోలీసుల ఎత్తులను ఎలా చిత్తు చేశాడు? అనేదే ‘దృశ్యం 3’ కథ.

బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు..

గత భాగాల క్రేజ్ వల్ల ‘దృశ్యం 3’ కి థియేటర్లలో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. విడుదలైన కేవలం 10 రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరి, ఈ ఫ్రాంచైజీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. మోహన్‌లాల్ కెరీర్‌లో ‘తుడరుమ్’, ‘L2: ఎంపురాన్’ చిత్రాల తర్వాత ఈ మైల్‌స్టోన్‌ను అందుకున్న సినిమా ఇదే కావడం విశేషం.

ఈ చిత్రంలో గత భాగాల తరహాలో ‘వావ్.. జార్జ్‌కుట్టి ఈ ట్విస్ట్‌ని ఎలా ప్లాన్ చేశాడు?’ అనిపించే మూమెంట్లు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ.. దర్శకుడు జీతూ జోసెఫ్ ఇచ్చిన ఎమోషనల్ అండ్ డీప్ ఎండింగ్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లిందని రివ్యూలు పేర్కొన్నాయి.

ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబవూరు నిర్మించిన ఈ చిత్రంలో మీనా, అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్, మురళి గోపి, సిద్ధిఖ్, ఆశా శరత్ తదితరులు తమ పాత పాత్రల్లోనే అలరించారు. థియేటర్లలో ఈ సస్పెన్స్ మిస్ అయిన వారు జూన్ 18 నుంచి ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు.

Tags:    

Similar News