Dhurandhar OTT release: రణవీర్ సింగ్ 'ధురంధర్' ఓటీటీ విడుదల తేదీ ఖరారు
Dhurandhar OTT release: సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రణవీర్ సింగ్ బ్లాక్‌బస్టర్ చిత్రం 'ధురంధర్ 2: ది రివెంజ్' ఓటీటీ విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది.
Dhurandhar OTT release: రణవీర్ సింగ్ 'ధురంధర్' ఓటీటీ విడుదల తేదీ ఖరారు
Dhurandhar OTT release: సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రణవీర్ సింగ్ బ్లాక్‌బస్టర్ చిత్రం 'ధురంధర్ 2: ది రివెంజ్' ఓటీటీ విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ ఈ చిత్ర డిజిటల్ ప్రసార తేదీని అధికారికంగా ప్రకటించింది. అయితే, ఐపీఎల్ క్రికెట్ హంగామా ముగిసిన తర్వాతే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సదరు సంస్థ నిర్ణయించింది.
జూన్ 4 నుండి డిజిటల్ ప్రసారం
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ చిత్రం థియేటర్లలో సంచలన విజయం సాధించింది. ఈ క్రమంలో ఈ సినిమా ఓటీటీ వేదికగా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా నిరీక్షించారు. తాజాగా జియో హాట్‌స్టార్ సంస్థ, ఈ చిత్రాన్ని జూన్ 4, 2026 నుండి భారతదేశంలో ప్రసారం చేయనున్నట్లు వెల్లడించింది. థియేటర్ వెర్షన్ కంటే భిన్నంగా, ఈ ఓటీటీ వెర్షన్ దాదాపు 3 గంటల 52 నిమిషాల సుదీర్ఘ నిడివితో రాబోతోంది. ఇది ఒక ఎక్స్‌టెండెడ్ ఎడిషన్ కానుండటంతో అభిమానులలో అంచనాలు మరింత పెరిగాయి.
నెట్‌ఫ్లిక్స్ పోటీ , పైరసీ ముప్పు
ఐపీఎల్ సీజన్ ముగిసేవరకు వేచి చూడాలనే జియో హాట్‌స్టార్ నిర్ణయం ఇప్పుడు ఆ సంస్థకు కొత్త సవాళ్లను తెచ్చిపెట్టింది. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త సంస్కరణను (రా అండ్ అన్‌కట్ వెర్షన్) నిన్నటి నుంచే ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ప్రసారం చేయడం ప్రారంభించింది. భారతీయ థియేటర్లలో సెన్సార్ కారణంగా తొలగించిన కొన్ని కీలకమైన, తీవ్రమైన సన్నివేశాలు , సంభాషణలు ఈ అంతర్జాతీయ వెర్షన్‌లో ఉన్నాయి. విదేశాలలో ఈ వెర్షన్ అందుబాటులోకి రావడంతో, భారతదేశంలోని పలువురు ప్రేక్షకులు అనధికారిక మార్గాలు , పైరసీ వెబ్‌సైట్ల ద్వారా దీనిని వీక్షించడం ప్రారంభించారు.
ఓటీటీ హక్కుల సవాలు
జియో హాట్‌స్టార్ భారతీయ ప్రేక్షకుల కోసం నాలుగు గంటల సుదీర్ఘ వినోదాన్ని సిద్ధం చేస్తున్నప్పటికీ, నెట్‌ఫ్లిక్స్ ద్వారా అంతకుముందే లీకైన సమాచారం అంతర్జాలంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సవాళ్లను అధిగమించి అధికారిక భారతీయ విడుదల ఏ మేరకు రికార్డు వీక్షణలను సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి.