Kalidas 2: ఓటీటీని షేక్ చేస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్..సీన్ సీన్‌కు ఊహించని ట్విస్ట్‌లు
Kalidas 2: సస్పెన్స్ థ్రిల్లర్ ప్రియులకు అదిరిపోయే వార్త! గ్రిప్పింగ్ స్టోరీతో తెరకెక్కిన 'కాళిదాస్ 2' ఇప్పుడు ఆరు ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చింది.
Kalidas 2: ఓటీటీని షేక్ చేస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్..సీన్ సీన్‌కు ఊహించని ట్విస్ట్‌లు
Ott Movie : ఓటీటీ ప్రపంచంలో ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా పేరు మార్మోగిపోతోంది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ వీకెండ్ ఒక అదిరిపోయే ట్రీట్ దొరికిందని చెప్పాలి. కేవలం ఒకటో రెండో కాదు.. ఏకంగా ఆరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకేసారి సందడి చేస్తూ, సస్పెన్స్ ప్రియులను ఉర్రూతలూగిస్తోంది ఆ సినిమా. అదే 'కాళిదాస్ 2'.
సాధారణంగా ఏదైనా సినిమా ఒక ఓటీటీలో రిలీజ్ అయితేనే గొప్ప. కానీ, ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఏకంగా అమెజాన్ ప్రైమ్, లయన్స్ గేట్ ప్లే, ఆహా తమిళ్, సన్ నెక్స్ట్, టెంట్ కొట్ట, షార్ట్ ఫిక్స్ ఇండియాలలో స్ట్రీమింగ్ అవుతూ రికార్డులు సృష్టిస్తోంది. ఐఎండిబిలో 7.4 రేటింగ్ సాధించిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా రేంజ్ ఏంటో.
అసలు కథేంటి?
ఒక గేటెడ్ కమ్యూనిటీలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. అందరూ సంబరాల్లో మునిగిపోయిన సమయంలో ఒక చిన్న పాప అకస్మాత్తుగా అదృశ్యమవుతుంది. ఈ కేసును ఛేదించడానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ 'కాళిదాస్' రంగంలోకి దిగుతాడు. అయితే, కేసు మొదలైన కొద్దిసేపటికే ఆ పాప శవమై కనిపిస్తుంది. అక్కడితో ఆగకుండా ఆ కమ్యూనిటీలో వరుసగా మరణాలు సంభవిస్తుంటాయి.
ఆ కమ్యూనిటీ సెక్రటరీ ఏదో పెద్ద నిజాన్ని దాస్తున్నాడని కాళిదాస్‌కు అర్థమవుతుంది. అసలు ఆ హత్యలు చేస్తోంది ఎవరు? ఆ గేటెడ్ కమ్యూనిటీ గోడల మధ్య దాగున్న భయంకరమైన రహస్యం ఏంటి? అనేదే ఈ సినిమా కథ. ప్రతి సీన్ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతూ, ఊహించని ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేస్తుంది.
పార్ట్ 1 చూడకపోయినా పర్లేదు
ఇది గతంలో వచ్చిన 'కాళిదాస్' సినిమాకు సీక్వెల్ అయినప్పటికీ, మొదటి భాగానికి దీనికి కథా పరంగా ఎలాంటి సంబంధం ఉండదు. కాబట్టి మీరు పార్ట్-1 చూడకపోయినా నేరుగా ఈ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు. రొమాంటిక్ లవ్ స్టోరీలకు భిన్నంగా, పక్కా సస్పెన్స్ డ్రామాను కోరుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఇంట్లోనే కూర్చుని ఒక గ్రిప్పింగ్ థ్రిల్లర్‌ను చూడాలనుకుంటే మాత్రం 'కాళిదాస్ 2' ని అస్సలు మిస్ అవ్వకండి.