Giddalur: ఓటర్ల నమోదులో టీడీపీ కసరత్తు.. గిద్దలూరులో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి!

Giddalur: గిద్దలూరులో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై టీడీపీ అవగాహన సదస్సు.

Update: 2026-06-08 04:54 GMT

Giddalur: ఓటర్ల నమోదులో టీడీపీ కసరత్తు.. గిద్దలూరులో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి!

మార్కాపురం జిల్లా: గిద్దలూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, బూత్ కన్వీనర్లు, బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), కార్యకర్తలకు ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై అవగాహన కల్పించే సమావేశం శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు మూలస్తంభమని, ఖచ్చితమైన, పరిశుభ్రమైన ఓటరు జాబితా ద్వారానే పారదర్శక ఎన్నికలు సాధ్యమవుతాయని అన్నారు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడు, యువతి తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని, మరణించిన వారి పేర్ల తొలగింపు, డూప్లికేట్ నమోదుల నిర్మూలన, చిరునామా మార్పులు వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని సూచించారు.

బూత్ కన్వీనర్లు, బీఎల్ఏలు ప్రతి ఇంటిని సందర్శించి కొత్త ఓటర్లను గుర్తించడం, పేర్లలోని తప్పులను సరిచేయించడం, వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారి వివరాలను నవీకరించడం, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి బూత్ బలపడితేనే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణ రాజకీయాలకు అతీతమైన జాతీయ బాధ్యత అని, ప్రతి అర్హుడికి ఓటు హక్కు అందేలా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో కార్యకర్తల పాత్ర కీలకమని అన్నారు.

ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి ప్రతి అర్హుడిని ఓటరుగా నమోదు చేయాలని, ఒక్క ఓటరు కూడా మిగలకుండా చూసి ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News