Markapuram: మార్కాపురంలో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు!

Markapuram: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం జమ్మనపల్లి గ్రామానికి చెందిన 34 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి.

Update: 2026-06-14 10:32 GMT

Markapuram: మార్కాపురంలో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు!

Markapuram: మార్కాపురం మండలం జమ్మనపల్లి గ్రామానికి చెందిన 34 కుటుంబాలకు పైగా ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ డా. షేక్ మహబూబ్ వలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా ఆదేశాల మేరకు పార్టీ బలోపేతం లక్ష్యంగా ఈ చేరికలు నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా డా. షేక్ మహబూబ్ వలి మాట్లాడుతూ జమ్మనపల్లి ఎస్సీ కాలనీలో డ్రైనేజీ, కాలువలు వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు గ్రామ సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు.

గ్రామ ప్రజల సమస్యలను ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్తులు డా. షేక్ మహబూబ్ వలిని ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు షేక్ మహబూబ్ సుభాని, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News